Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ 2019: జోసెఫ్ దెబ్బ, ముంబై చేతిలో హైదరాబాద్ చిత్తు

ముంబై ఇండియన్స్ బౌలర్ జోసెఫ్ దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. కీలకమైన వికెట్లను తీస్తూ జోసెఫ్ ముంబై ఇండియన్స్ విజయానికి బాట వేశాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ కు ఊరట లభించింది.

IPL 2019: Sun Risers Hyderabad vs Mumbai Indians match updates
Author
Uppal, First Published Apr 6, 2019, 9:54 PM IST

హైదరాబాద్: ఐపిఎల్ 12 ఎడిషన్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ చిత్తయింది. ముంబై తమ ముందు ఉంచిన 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై బౌలర్ జోసెఫ్ బౌలింగు దెబ్బకు హదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. జోసెఫ్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ 17.4 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుటైంది. దీంతో ముంబై 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.ముంబై బౌలర్లలో జోసెఫ్ ఆరు వికెట్లు తీయగా, చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు బెహ్రాండార్ఫ్, బుమ్రాలకు తలో వికెట్ లభించాయి.

ముంబై ఇండియన్స్ తమ ముందు ఉంచిన 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్  91 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ జోసెఫ్ బౌలింగులో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత ఐదు పరుగులు జోడించి ఆలవుటైంది.అంతకు ముందు హైదరాబాద్ 90 పరుగుల స్కోరు వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ నబీ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు.

హైదరాబాద్ 88 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి బంతికే మరో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ జోసెఫ్ బౌలింగులోనే కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. దీపక్ హుడా 20 పరుగులు చేసి జోసెఫ్ బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు63 పరుగుల స్కోరు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. యూసుఫ్ పఠాన్ చాహర్ బౌలింగులో డకౌట్ అయ్యాడు.

హైదరాబాద్ 61 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 16 పరుగులు చేసి బెహ్రన్ డార్ఫ్ బౌలింగులో అవుటయ్యాడు.హైదరాబాద్ 42 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. విజయ్ శంకర్ 5 పరుగులు మాత్రమే చేసి జోసెఫ్ బౌలింగులో వెనుదిరిగాడు.సన్ రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బెయిర్ స్టో 16 పరుగులు చేసి చాహర్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. అదే స్కోరు వద్ద హైదరాబాదు రెండో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోసెఫ్ బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఐపిఎల్ 12వ ఎడిషన్ లో భాగంగా జరిగిన మ్యాచులో పోలార్డ్ ముంబై ఇండియన్స్ పరువు కాపాడాడు. సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు పడుతున్న క్రమంలో పోలార్డ్ చివరలో ధాటిగా ఆడి గౌరవప్రదమైన స్కోరును సాధించి పెట్టాడు. దాంతో హైదరాబాదు సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పోలార్డ్ నాలుగు సిక్స్ లు, రెండు ఫోర్ల సాయంతో 26 బంతుల్లో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రెండో వైపు ఉన్న జోసెఫ్ కు స్ట్రయికింగ్ రాకుండా చూస్తూ పోలార్డ్ స్కోరు పెంచాడు. స్కోరు వంద పరుగులు కూడా దాటుతుందా లేదా అనుమానాలు నెలకొన్న స్థితిలో పోలార్డ్ ధాటిగా ఆడి స్కోరును పరుగు పెట్టించాడు. 

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. మొదట్లో లభించిన లైఫ్ ను కూడా అతను వాడుకోలేకపోయాడు. కేవలం 14 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ వికెట్లు వరుసగా పడుతూ వెళ్లాయి. సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 7 పరుగులు), డీకాక్ (18 బంతుల్లో 19 పరుగులు) కూడా విఫలమయ్యారు. 

యువరాజ్ సింగ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 17 పరుగులు చేసి రన్నవుట్ గా వెనుదిరిగాడు. పాండ్యా సోదరులు కృణాల్, హార్డిక్ కూడా పెద్దగా పరుగులు చేయలేదు. కృణాలు పాండ్యా 13 బంతుల్లో 6 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 14 బంతుల్లో 14 పరుగులు చేశాడు. చాహర్ 7 బంతుల్లో 10 పరుగులు చేశాడు. 

సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లు సమిష్టిగా రాణించారు. సిద్ధార్థ కౌల్ కు రెండు వికెట్లు దక్కాయి. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. యూసుఫ్ పఠాన్ ఒక్క ఓవరు వేసి 8 పరుగులు సమర్పించుకున్నాడు.    

Follow Us:
Download App:
  • android
  • ios