ఐపిఎల్ మరో రసవత్తర పోరుకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం సిద్దమయ్యింది. ఇప్పటికే 11 మ్యాచులాడి ఐదొంట్లో గెలిచి ఆరింట ఓడిన సమాన స్థాయిలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ లెవెన్ పంజాబ్ లు తాడోపేడో తేల్చకోనున్నాయి. ఇప్పటికే చెన్నై, డిల్లీలు ప్లేఆఫ్ కు చేరుకోగా మిగతా రెండు స్ధానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో ఇవాళ ఉప్పల్ లో తలపడనున్న జట్లు కూడా వున్నాయి. రెండు జట్లకు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది.
ఈ ఐపిఎల్ సీజన్ వార్నర్ మంచి విజయంతో ముగించాడు. కింగ్స్ లెవెన్ పంజాబ్ పై సన్ రైజర్స్ 45 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్ బెర్తుకు మరింత చేరువయ్యింది. సొంత మైదానం ఉప్పల్ లో సన్ రైజర్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించి పంజాబ్ ను చిత్తు చేసింది.
మొదట బ్యాంటింగ్ లో డేవిడ్ వార్నర్ 2 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 56 బంతులు చేశాడు. మనీశ్ పాండే 36, సాహా 28, నబి 20 పరుగులతో రాణించడంతో సన్ రైజర్స్ 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రాహుల్ ఒక్కడే 5 సిక్సులు, 4 ఫోర్లతో 56 బంతుల్లో 79 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్లలో విజయానికి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులను సాధించాల్సిన పరిస్థితి రావడంతో ఒత్తిడికి లోనై రాహుల్ ఔటయ్యాడు. దీంతో పంజాబ్ గెలుపు ఇశలు గల్లంతయ్యాయి.
సన్ రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లు చక్కగా బౌలిగ్ చేశారు. రషీద్ అయితే నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ కూడా 3 వికెట్లు తీసి హైదరాబాద్ గెలుపులో తనవంతు పాత్ర వహించాడు. చివరి ఓవర్లలో సందీప్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇలా పంజాబ్ ను 167 పరుగులకే కట్టడి చేసి సన్ రైజర్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సన్ రైజర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఐపిఎల్ సీజన్లో చివరి మ్యాచ్ ను సక్సెస్ ఫుల్ బ్యాటింగ్ ముగించాడు. అతడు కేవలం 56 బంతుల్లోను 2 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. అయితే మొదట్లో మంచి ఊపుమీద సాగిన హైదరాబాద్ బ్యాటింగ్ చివరి ఓవర్లలో నెమ్మదించింది. మంచి ఊపుమీదున్నట్లు కనిపించిన విలియమ్సన్, నబీలను షమీ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపించాడు. దీంతో ఇంకొన్ని పరుగులను సాధించే అవకాశాన్ని సన్ రైజర్స్ కోల్పోయింది. మొత్తానికి నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ 2, రవిచంద్రన్ అశ్విన్ 2, మురుగన్ అశ్విన్, అన్షుదీప్ తలో వికెట్ పడగొట్టారు.
మొదట టాస్ గెలిచిన పంజాబ్ ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది.. దీంతో ఆతిథ్య జట్టు తమ సొంత మైదానంలో ముందుగా బ్యాటింగ్ చేసింది.. సన్ రైజర్స్ హిట్టర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో ఆడే చివరి మ్యాచ్ ఇదే కావడంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది.
సన్ రైజర్స్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. అభిషేక్ శర్మ, మహ్మద్ నబి, సందీప్ శర్మ లు జట్టులోకి వచ్చారు. అలాగే పంజాబ్ జట్టులోకి కూడా ప్రభ్‌సిమ్రన్ సింగ్, ముజీబ్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
సన్ రైజర్స్ జట్టు:
డేవిడ్ వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే, విజయ్ శంకర్, నబి, సాహా, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్,, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ
కింగ్స్ లెవెన్ పంజాబ్:
కెఎల్ రాహుల్, గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, పూరన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్,ఆర్ అశ్విన్, ముజీబ్ ఉల్ రెహ్మాన్, షమీ, ఎమ్ అశ్విన్, అర్శదీప్ సింగ్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 30, 2019, 12:04 AM IST