హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన ఐపిఎల్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఓపెనర్లు వాట్సన్(31), డుప్లెసిస్(45), పరుగులతో శుభారంభాన్ని అందించారు. 

అయితే తర్వాత వచ్చిన బ్యాట్సమెన్స్ సురేశ్ రైనా 13, రాయుడు 25, జాదవ్ 1, జడేజా 10 పరుగులే చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, విజయ్ శంకర్ 1, నదీమ్ 1, అహ్మద్ ఒక వికెట్ తీశారు.
 
ఆ తర్వాత 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు దంచికొట్టడంతో విజయం సునాయసంగా దక్కింది. హైదరాబాద్ బ్యాటింగ్‎లో వార్నర్ 50(25 బంతుల్లో 5 ఫోర్లు), బెయిర్ స్టోన్ 61(44 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు)తో నాటౌట్ గా నిలిచాడు.