Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు-రాజస్థాన్ మ్యాచ్: ఆరంభానికి ముందే వర్షం అడ్డంకి

ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ గెలిచిన రాజస్ధాన్ పీల్డింగ్ ఎంచుకోగా ఒక్క బాల్ కూడా పడకముందే జోరున వర్షం మొదలయ్యింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. 
 

ipl 2019: royal challengers bangalore vs rajasthan royals match updates
Author
Bangalore, First Published Apr 30, 2019, 8:28 PM IST

ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ గెలిచిన రాజస్ధాన్ పీల్డింగ్ ఎంచుకోగా ఒక్క బాల్ కూడా పడకముందే జోరున వర్షం మొదలయ్యింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. 

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ జట్టు నష్టపోనుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆ జట్టుకు కేవలం మరో మ్యాచ్ మాత్రమే మిగిలివుంటుంది. ఇప్పటికే 12 మ్యాచుల్లో కేవలం ఐదింట మాత్రమే గెలిచి 10 పాయింట్లతో చివరినుండి రెండో స్థానంలో నిలిచింది.

మిగతా రెండు మ్యాచులను కూడా గెలిచి ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారంగా ప్లేఆఫ్ కు చేరుకోవాలని రాజస్థాన్ భావించింది. ఇలాంటి సమయంలో ఈ మ్యాచ్ రద్దయితే ఆ ఆశలను రాజస్థాన్ జట్టు వదులుకోవాల్సి వుంటుంది. మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో చివరి మ్యాచ్ గెలిచినా రాయల్స్ ఖాతాలో 13 పాయింట్లే వుంటాయి. కాబట్టి గతంలో మాదిరిగా ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం వుండదు.

ఇక మరో జట్టు ఆర్సిబి ఇప్పటికే లీగ్ దశ నుండే  ఇంటిముఖం పట్టడం ఖాయమైంది. కానీ చివరి రెండు మ్యాచులను గెలిచి పరువు నిలుపుకోవాలని ఆర్సిబి భావిస్తోంది.  కాబట్టి ఈ మ్యాచ్ రద్దయినా, జరిగనా ఆ జట్టుకు వచ్చే నష్టమేమీ లేదు.  

రాజస్తాన్‌ టీం: 

స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), అజింక్యా రహానే, సంజూ శాంసన్‌, లివింగ్‌ స్టోన్‌, రియాన్‌ పరాగ్‌, స్టువర్ట్ బిన్ని, మహిపాల్‌ లామ్రోర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, వరుణ్‌ ఆరోన్‌, థామస్‌

ఆర్సీబీ టీం: 

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, ఏబీ డివిలియర్స్‌, క్లాసన్‌, గుర్‌కీరత్‌ సింగ్‌, స్టొయినిస్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, కుల్వంత్‌ ఖేజ్రోలియా, చహల్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios