మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తయారైంది. ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఐపీఎల్‌లో భాగంగా మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ విజయం సాధించింది. కేఎల్ రాహుల్, గేల్ విధ్వంసక బ్యాటింగ్‌తో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్ పడింది. ఐపీఎల్ 2019లో ఒక జట్టుకు జరిమానా పడటం ఇదే తొలిసారి.