మొహాలి: ముంబై ఇండియన్స్ తమ ముందు ఉంచిన 177 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ అలవోకగా ఛేదించింది. ముంబైపై పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 18.4 ఓవర్లలో మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ 117 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ముంబై ఇండియన్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అంతకు ముందు క్రిస్ గేల్ 40 పరుగులు చేసి, మాయాంక్ అగర్వాల్ 43 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగులో అవుటయ్యారు. కెఎల్ రాహుల్ 71 పరుగులతో, మిల్లర్ 15  పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 31 పరుగులు చేయగా, కృణాల్ పాండ్యా పది పరుగులు చేసి అవుటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో మొహమ్మద్ షమీ, విల్జోయెన్, మురగన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. టైకి ఒక్క వికెట్ దక్కింది.

పంజాబ్ పై మ్యాచులో యువరాజ్ సింగ్ విఫలమయ్యాడు. అతను కేవలం 18 పరుగులు చేసి అశ్విన్ బౌలింగులో వెనుదిరిగాడు. దీంతో ముంబై ఇండియన్స్ 125 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 146 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. పోలార్డ్ 7 పరుగులు చేసి టై బౌలింగులో అవుటయ్యాడు. 

ముంబై ఇండియన్స్ 120 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ వచ్చిన డీకాక్ 39 బంతుల్లో రెండు సిక్స్ లు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి మొహమ్మద్ షమీ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు.

పంజాబ్ పై జరిగిన ఐపిఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ 62 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 32 పరుగులు చేసి విల్జోయెన్ బౌలింగులో పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 12వ ఎడిషన్ లో భాగంగా మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం ఐఎస్ బింద్రా స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ పై టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

జట్లు

ముంబై ఇండియన్స్: క్వింటోన్ డీ కాక్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కిరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, మిచెల్ మెక్ క్లింగాన్, మాయాంక్ మార్కండే, జస్ ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: క్రిస్ గేల్, మాయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ ఖాన్, డేవిడ్ మిల్లర్,  మణదీప్ సింగ్, హార్దూస్ విల్జోయెన్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), మురుగన్ అశ్విన్, మొహమ్మద్ షమీ, ఆండ్య్రూ టై