ఐపిఎల్ సీజన్ 12లో లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. అయినా ఇంకా ప్లేఆఫ్ జట్లుపై క్లారిటీ రాలేదు. రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ కు చేరుకోగా మిగిలిన రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు తలపడుతున్నారు. ఇలా ప్లేఆఫ్ కు అవకాశాలు ఎక్కువగా వున్న ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ జట్లు గురువారం వాంఖడే స్టేడియంలో తలపడుతున్నాయి. ఇలా ప్లేఆఫ్ కోసం జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది.
సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ 162 పరుగలకే పరిమితమయ్యింది. మ్యాచ్ ను దాటిగా ఆరంభించిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. వేగంగా పరుగులు సాధించే క్రమంలో ముంబై రోహిత్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ డికాక్ ఒక్కడే సమయోచితంగా ఆడుతూ 58 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లెవరూ రాణించకకపోవడంతో 162 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
ముంబై ఇండియన్ మరో వికెట్ కోల్పోయింది.దాటిగా ఆడుతూ కేవలం 10 బంతుల్లోనే ఒక సిక్స్, ఓర్ సాయంతో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా పెవిలియన్ బాట పట్టాడు. భువనేశ్వరఓ అద్భుతమైన బంతితో పాండ్యాను బోల్తా కొట్టించాడు.
స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ముంబై మరో రెండు వికెట్లను కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ ను కూడా ఖలీల్ అహ్మద్ ఔట్ చేయగా అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన లూయిస్ ను నబీ పెవిలియన్ కు పంపించాడు. ఇలా కేవలం ఒక్క పరుగు తేడాతోనే ఇద్దరు బ్యాట్ మెన్స్ ఔటవడంతో ముంబై స్కోరు వేగం కాస్త తగ్గింది.
మ్యాచ్ ఆరంభంలోనే ముంబైకి షాక్ తగిలింది. సొంత మైదానంలో దాటిగా ఆడుతూ బ్యాటింగ్ ను ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 18 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో మరో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు.
ఐపిఎల్ సీజన్ 12లో లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. అయినా ఇంకా ప్లేఆఫ్ జట్లుపై క్లారిటీ రాలేదు. రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ కు చేరుకోగా మిగిలిన రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు తలపడుతున్నారు. ఇలా ప్లేఆఫ్ కు అవకాశాలు ఎక్కువగా వున్న ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ జట్లు గురువారం వాంఖడే స్టేడియంలో తలపడుతున్నాయి. ఇలా ప్లేఆఫ్ కోసం జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. గుప్తిల్ తో పాటు తంపీ జట్టులో చేరారు. అయితే ముంబై మాత్రం గత మ్యాచ్ లో ఆడిన టీంను కంటిన్యూ చేసింది.
ముంబై ఇండియన్స్ టీం:
డికాక్, రోహిత్ శర్మ, లూయిస్,, సూర్య కుమార్ యాదవ్,, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బరిందర్ శరన్, రాహుల్ చాహర్, మలింగ, బుమ్రా
సన్ రైజర్స్ హైదరాబాద్ టీం:
మార్టిన్ గుప్తిల్, వృద్దిమాన్ సాహా, మనీశ్ పాండే, మహ్మద్ నబీ, విలియమ్సన్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, తంపి