కోల్‌కతా నైట్ రైడర్స్ వీరవిహారం ముందు 184 పరుగల భారీ లక్ష్యం చిన్నబోయింది. ఓపెనర్ శుభమన్ గిల్ 49 బంతుల్లో 65 పరుగలతో చివరి  వరకు నిలిచి విజయతీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్ లిన్ 46,ఊతప్ప 22,రస్సెల్స్ 24,కార్తిక్ 21 పరుగులతో రాణించడంతో 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. 183 పరుగుల భారీ పరుగులను కూడా పంజాబ్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. 

 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా బ్యాటింగ్ మొదటినుండి విజయం దిశగానే సాగింది. ఓపెనర్ లిన్(22 బంతుల్లో 44 పరుగులు), ఊతప్ప(14 బంతుల్లో 22 పరుగులు)  మంచి శుభారంభాన్నిచ్చారు. మంచి ఊపుమీదున్న సమయంలో  రస్సెల్ ఔటయ్యాడు. 14 బంతుల్లోనే 2 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అతడు చివరకు షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.

పంజాబ్ బ్యాట్ మెన్ కుర్రన్ చివరి ఓవర్లలో చెలరేగి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ 183 పరుగులు భారీ స్కోరు సాధించింది. కుర్రన్ కేవలం 24 బంతుల్లోనే 2 సిక్సులు ఏడు ఫోర్లతో రెచ్చిపోయి 55 పరుగులు చూశాడు. అంతకు ముందు పూరన్ 48, అగర్వాల్ 36 పరుగులతో రాణించడంతో కోల్ కతా ముందు 184 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచగలిగింది. 

 పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది.17 బంతుల్లో 25 పరుగులు చేసిన మన్ దీప్ సింగ్ కెకెఆర్ బౌలర్ గుర్నే బౌలింగ్ లో కీపర్ ఊతప్పకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశ్విన్ బరిలోకి దిగాడు. అయితే పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ఎక్కువగా క్రీజులో నిలవలేకకపోయాడు. మూడు బంతులను ఎదుర్కొని  ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన అశ్విన్ రస్సెల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

వెంటవెంటనే క్రీజులో కుదురుకున్న ఆటగాళ్లు ఔటవడంతో కింగ్స్ లెవెన్ జట్టు స్కోరు వేగం తగ్గింది. పూరన్, మయాంక్ అగర్వాల్సమయోచితంగా ఆడుతూ మంచి ఇన్నింగ్స్ నెలకొల్పారు. అయితే స్కోరు వేగాన్ని మరింత పెంచే క్రమంలో వీరిద్దరూ ఔటయ్యారు.మొదట పూరన్ ఔటవగా ఆ తర్వాత అనవసర పరుగుకు ప్రయత్నించి అగర్వాల్ రనౌటయ్యాడు. దీంతో 111 పరుగుల వద్దే నాలుగు వికెట్లు కోల్పోయింది.  

దాటిగా ఆడుతూ పంజాబ్ పరుగుల వేగాన్ని పెంచిన  పూరన్ ఔటయ్యాడు. కేవలం 27 బంతుల్లోనే 4 సిక్సులు, 3 ఫోర్లు బాది 48 పరుగులు చేసిన అతడు హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలోనే ఆగిపోయాడు. రానా బౌలింగ్ లో మరో భారీ షాట్ తో అర్థశతకాన్ని పూర్తి చేసుకోవాలని ప్రయత్నించి చివరకు వారియర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

కోల్‌కతా బౌలర్ సందీప్ వారియర్ బౌలింగ్ దాటికి పంజాబ్ ఓపెనర్లిద్దరూ బలయ్యారు. మొదట రాహుల్ ని ఔట్ చేసిన వారియర్ ఆ తర్వాతి ఓవర్లోనే విద్వంసకర ఆటగాడు గేల్ ను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో కేవలం 22 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది. 

మొదట బ్యాటింగ్ కకు దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సందీప్ వారియర్ వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ కెఎల్ రాహుల్ లిన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ ఏడు బంతులను ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. 

ఐపిఎల్ సీజన్ 12 లో మరో రసవత్తర పోరుకు కింగ్స్ లెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిందే. దీంతో గెలుపే లక్ష్యంగా పోరాడడానికి ఇరు జట్లు పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరాటానికి చండీఘడ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. 

ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సెంకండ్ హాఫ్ సమయంలో మంచు కురిసే అవకాశం వుందని....దాన్ని దృష్టిలో పెట్టుకునే పీల్డింగ్ ఎంచుకున్నట్లు కెకెఆర్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ తెలిపాడు. అలాగే గత మ్యాచ్ లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ కొనసాగిస్తున్నట్లు వెల్లడించాడు. 

అయితే పంజాబ్ జట్టులో మాత్రం రెండు మార్పులు చేపట్టినట్లు కెప్టెన్ అశ్విన్ తెలిపాడు. డేవిడ్ మిల్లర్, ముజీబ్ ల స్థానంలో కుర్రమ్, ఆండ్రూ టై ని జట్టులోకి చేర్చుకున్నట్లు ప్రకటించాడు. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవారమని...కానీ తమకా అవకాశం రాలేదన్నాడు. టాస్ ఓడిపోయినా మ్యాచ్ గెలవడానికి తమ అత్యుత్తమ ఆటతీరుతో పోరాడతామని అశ్విన్ అన్నాడు. 

కింగ్స్ లెవెన్ పంజాబ్ టీం:

కెఎల్ రాహుల్, గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మన్ దీప్ సింగ్, సామ్ కుర్రమ్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, ఆండ్రూ టై, మహ్మద్ షమీ, ఆర్షదీప్  సింగ్ 

కోల్‌కతా నైట్ రైడర్స్ టీం: 

క్రిస్ లిన్, శుభమన్ గిల్, రాబిన్ ఊతప్ప, నితీశ్ రానా, దినేశ్ కార్తిక్, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, హ్యారీ గుర్నే, సందీప్ వారియర్