Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో సన్ రైజర్స్ అదుర్స్...చిత్తు చిత్తుగా ఓడిన ఆర్సిబి

ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో మొదటి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పర్యటక రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టుతో ఈ మ్యాచ్ లో తలపడనుంది. మరికొద్దిసేపట్లో ఆరంభంకానున్న మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం చేపట్టిన టాస్ ను గెలిచిన రాయల్ చాలెంజర్స్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో సన్ రైజర్ప్ ఈ సీజన్ ను మొదటిసారిగా బ్యాటింగ్ తో ఆరంభిస్తోంది. 
 

ipl 2019 ; hyderabad match updates
Author
Hyderabad, First Published Mar 31, 2019, 3:52 PM IST

సొంత మైదానం  ఉప్పల్ లో జరిగిన మొదటి ఐపిఎల్ మ్యాచ్ ను సన్ రైజర్స్ జట్టు గ్రాండ్ విక్టరీతో ప్రారంభించింది. ఏకంగా 118 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టికరిపించింది. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. 

భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆర్సిబి బ్యాటింగ్ ఏ దశలో లక్ష్యం దిశగా సాగలేదు. ఆదిలోనే సన్ రైజర్స్ బౌలర్ నబి దెబ్బకు బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోయారు. నబి 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమూ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

మొత్తానికి హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో బ్యాటింగ్ లో అదరగొట్టగా నబి బౌలింగ్ లో అదరగొట్టాడు. దీంతో కోహ్లీ సారథ్యంలోని ఆర్సిబికి మరో ఓటమి తప్పలేదు. ఎస్‌ఆర్‌హెచ్ రెండో విజయాన్ని నమోదు చేసుకోగా ఆర్సిబి ఇంకా గెలుపు ఖాతా కూడా తెరవలేదు.   

ఆర్సిబి బ్యాట్ మెన్స్  అందరూ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతున్నారు. విరాట్ కోహ్లీ కూడా నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో ఆర్సిబి గెలుపు ఆశలు దాదాపు గల్లంతయ్యాయనే చెప్పాలి. కేవలం 30 పరుగులకే ఆర్సిబి ఐదు వికెట్లు కోల్పోయింది. 

సన్ రైజర్స్ బౌలర్ నబీ దాటికి ఆర్సిబి బ్యాట్ మెన్స్ పెవిలియన్ బాట పట్టారు. చివరి మ్యాాచ్ లో రాణించిన డివిల్లియర్స్ కూడా నబీ విసిరిన బంతులను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. ఇలా కేవలం సింగిల్ రన్ వద్ద ఔటయ్యాడు. మొత్తంగా ఇప్పటివరకు ఆర్సిబి కోల్పోయిన మూడు వికెట్లు కూడా నబీ ఖాతాలోను పడ్డాయి. 

ఆర్సిబి మరో వికెట్ కోల్పోయింది. భారీ హిట్టర్ హెట్మెయర్ రెండో వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద  నబీ బౌలింగ్ లో హెట్మయర్ స్టంపౌటయ్యాడు. 

232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబికి ఆదిలోని షాక్ తగిలింది. ఓపెనర్ పార్థివ్ పాటిల్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నబీ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో ఆర్సిబి కేవలం 13 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. 

హైదరాబాద్ ఉప్పల్ వేదికన జరుగుతున్న ఐపిఎల్ సీజన్ 12 మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ అదరగొట్టింది. ఓపెనర్లు బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ ఇద్దరూ సెంచరీలు సాధించడంతో హైదరాబాద్ జట్టు 231 పరుగులు చేసింది. ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఓపెనర్లిద్దరు 185 పరుగుల వరకు ఒక్క వికెట్ పడకుండా చూశారు.  బెయిర్ స్టో   51 బంతుల్లో సెంచరీ సాధించగా, వార్నర్ 55 బంతుల్లో సెంచరీ చేశాడు. 

ఆర్సిబి బౌలర్లలో చాహల్ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు. సన్ రైజర్స్ బౌలర్లను అడ్డుకోవడంలో విఫలమవడంతో ఆర్సిబి ముందు 232 పరుగులు భారీ లక్ష్యం వుంది. 

అనవసర పరుగుకోసం ప్రయత్నించి హైదరాబాద్ జట్టు యువ ప్లేయర్ విజయ్ శంకర్ రనౌటయ్యాడు. 

ఎట్టకేలకు ఆర్సిబి జట్టు  బౌలర్లు సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడిని విడగోట్టగలిగారు. 185 పరుగుల వద్ద సెంచరీ వీరుడు బెయిర్ స్టో ను చాహల్ ఔట్ చేశాడు. అయితే మరో డాషింగ్ ప్లేయర్ వార్నర్ ఇంకా నాటౌట్ గానూ బ్యాటింగ్ చేస్తున్నాడు. 

సన్ రైజర్స్ ఓపెనర్ల దూకుడుతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టు ఓపెనర్ బెయిర్ స్టో సెంచరీ సాధించాడు. కేవలం 51 బంతుల్లోనే  అతడు సెంచరీ మార్కును చేరుకున్నాడు.

హైదరాబాద్ ఓపెనర్లు ఉప్పల్ స్టేడియంలో అదరిపోయే బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నారు. ఇప్పటికు హాఫ్ సెంచరీ సాధించిన బెయిస్టో సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. అలాగే డాషింగ్ బ్యాట్ మెన్ వార్నర్ కూడా కేవలం 32 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.. వీరిద్దరి విజృంభణతో సన్ రైజర్స్ వికెట్లేవీ నష్టపోకుండా 13 ఓవర్లలో 145 పరుగులు చేసింది. 

సొంత మైదానంంలో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో అదరగొడుతోంది. ఓపెనర్లు వార్నర్, బుయిర్ స్టో ఆరంభం నుండి దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో కేవలం 28 బంతుల్లోనే బెయిర్ స్టో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో మొదటి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పర్యటక రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టుతో ఈ మ్యాచ్ లో తలపడనుంది. మరికొద్దిసేపట్లో ఆరంభంకానున్న మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం చేపట్టిన టాస్ ను గెలిచిన రాయల్ చాలెంజర్స్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో సన్ రైజర్ప్ ఈ సీజన్ ను మొదటిసారిగా బ్యాటింగ్ తో ఆరంభిస్తోంది. 

ఈ సీజన్లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓటములపాలై  విజయంకోసం ఎదురుచూస్తున్న ఆర్సిబి ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెవాలని చూస్తోంది. అయితే సొంత మైదానంలో జరుగుతున్న మొదటి మ్యాచ్ ఎలాగైన గెలిచి శుభప్రదంగా ఆరంభించాలని సన్ రైజర్స్ భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ పై బోణి కొట్టిన హైదరాబాద్ మంచి ఊపుమీదుంది. ఇలా ఇరు జట్లు  ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.  

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా జట్టకు దూరమయ్యారు. అతడి స్ధానంలో మహ్మద్ నబీ జట్టులోకి రాగా భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  
 

హైదరాబాద్ జట్టు;

డేవిడ్ వార్నర్, జోన్ని బెయిర్ స్టో(వికెట్ కీఫర్) విజయ్ శంకర్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, దీఫక్ హుడా, యూసుఫ్ పఠాన్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ  

బెంగళూరు జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), పార్థీవ్ పటేల్(వికెట్ కీఫర్), మోయిన్ అలీ, డివిల్లియర్స్, హెట్మెయర్, శివమ్ ధూబే, గ్రాండ్ హోమ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రయాస్ రాయ్ బర్మన్, యజువేందర్ చాహల్ 
 

Follow Us:
Download App:
  • android
  • ios