న్యూఢిల్లీ: ఐపిఎల్ 12వ ఎడిషన్ లో భాగంగా శనివారం కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచు ఉత్కంఠగా సాగింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. అయితే, ఈ విజయం ఢిల్లీకి సూపర్ ఓవరులో దక్కింది,

కోల్ కతా తన ముందు ఉంచిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ జట్టు పది పరుగులు చేయగా కోల్‌కతా జట్టు 7 పరుగులే చేయగలిగింది. దీంతో విజయం ఢిల్లీ వశమైంది.

ఢిల్లీ జట్టు స్టార్ ఆటగాడు పృథ్వీ షా ఒక్క పరుగుతో మిస్సయ్యాడు. పృధ్వీ షా 99, ధావన్ 16, అయ్యర్ 43, పంత్ 11, విహారీ 2 పరుగులు చేశారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. నిఖిల్ నాయక్(7), ఊతప్ప(11), క్రిస్ లిన్(20), నితిశ్ రానా(1), కార్తీక్ 50, గిల్(4), రస్సెల్ 62, చావ్లా 12, కుల్దీప్ యాదవ్ 10 పరుగులు చేశారు.