Asianet News TeluguAsianet News Telugu

సూర్యకుమార్ సూపర్ షో...చెన్నైపై గెలిచి నేరుగా ఫైనల్‌కు చేరిన ముంబై

ఐపిఎల్ సీజన్ 12లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం వేదికయ్యింది. డైరెక్ట్ పైనలిస్ట్ ను నిర్ణయించే ఈ మ్యాచ్ లో పాయింట్ టేబుల్ లో టాప్ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, సెకండ్ ప్లేస్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై  విజేతగా నిలిచి నేరుగా  ఫైనల్ కు చేరగా చెన్నై ఓటమిపాలై మరో అవకాశాన్ని వినియోగించుకోవాల్సి వస్తోంది.

IPL 2019: chennai super kings vs mumbai indians qualifier match updates
Author
Chennai, First Published May 7, 2019, 7:49 PM IST

ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్ బెర్తును ముంబై ఇండియన్స్ ఖాయం చేసుకుంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ను వారి సొంత మైదానంలోనే చిత్తుగా ఓడించి ముంబై తన సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ తర్వాత బౌలింగ్ విభాగాల్లో చెన్నై  నడ్డివిరిచిన ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ ఐపిఎల్ సీజన్లో ఇప్పటివరకు మూడు సార్లు ఈ రెండు జట్లు తలపడగా అన్నిసార్లూ ముంబైదే పైచేయగా నిలిచింది.

చెన్నై విసిరిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంంబై  ఆడుతు  పాడుతూ చేధించింది. అయితేే చేధనలో ఓపెనర్లు రోహిత్(4 పరుగులు), డికాక్ (8 పరుగులు) వికెట్లను తొందరగానే కోల్పోయిన ముంబై ఆ తర్వాత చెలరేగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు. అతడికి మొదట  ఇషాన్ కిషన్(28 పరుగులు) తర్వాత హర్దిక్ పాండ్యా(13 పరుగులు)  సహకారం అందించారు. ఇలా కేవలం 18.3  ఓవర్లలోనే ముంబై విజయతీరాలకు చేరింది.

సొంత  మైదానమైన చెపాక్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనికి తన నిర్ణయం తప్పని  మొదట్లోనే అర్థమయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్ మెన్స్ రెచ్చిపోకుండా ముంబై ఇండియన్స్ బౌలర్లు చక్కగా కట్టడిచేసింది. మ్యాచ్ ఆరంభంలో వరుసగా వికెట్లు తీసి చెన్నై బ్యాట్ మెన్స్ పై ఒత్తిడి పెంచడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. అయితే చివరి  ఓవర్లలో అంబటి రాయుడు, ధోని చెలరేగడంతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరయినా చేయగలిగింది. ముంబై బౌలర్లు సీఎస్కేని 131 పరుగులకే పరిమితం చేశారు. ధోని 37, రాయుడు 42 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.  

 చెన్నై జట్టును దెబ్బమీద దెబ్బతీస్తూ ముంబై విరామం లేకుండా వికెట్లు పడడగొట్టింది. ముంబై బౌలింగ్ దాటికి  చెన్నై టాప్ ఆర్డర్ పెవిలియన్ కు  క్యూకట్టింది. ఓపెనర్ డుప్లెసిస్, రైనా, వాట్సన్ లను తొందరగానే ఔట్ చేసిన ముంబై మిగతా చెన్నై బ్యాట్ మెన్స్ ని ఒత్తిడిలోకి నెట్టగలిగారు. దీంతో ధోని లాంటి హిట్టర్ కూడా వికెట్లను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.. దీంతో పరుగుల వేగం తగ్గి సీఎస్కే కేవలం 131 పరుగులకే పరిమితమయ్యింది. 

 ఐపిఎల్ సీజన్ 12లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం వేదికయ్యింది. డైరెక్ట్ పైనలిస్ట్ ను నిర్ణయించే ఈ మ్యాచ్ లో పాయింట్ టేబుల్ లో టాప్ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, సెకండ్ ప్లేస్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై  విజేతగా నిలిచి నేరుగా  ఫైనల్ కు చేరగా చెన్నై ఓడిపోయి   మరో అవకాశాన్ని వినియోగించుకోవాల్సి వస్తోంది.

 మ్యాచ్ ను ఎలాగయినా గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకోవాలని అటు ఆతిథ్య చెన్నై, ఇటు పర్యటక ముంబై జట్లు భావిస్తున్నాయి. గేలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహప్రతివ్యూహాలతో బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో కూడా మరింత ఆసక్తి పెరిగింది. 

 చెన్నై టీం;

డుప్లెసిస్,షేన్ వాట్సన్, సురేశ్ రైనా, మురళీ విజయ్, ధోనీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్  

ముంబై ఇండియన్స్ టీం;

డికాక్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, ఎస్ యాదవ్, కిరన్ పొలార్డ్, హర్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, ఆర్ చాహర్, లసిత్ మలింగా, బుమ్రా  

 

Follow Us:
Download App:
  • android
  • ios