Asianet News TeluguAsianet News Telugu

డివిలియర్స్, స్టోయినీస్ మెరుపులు...బెంగళూరు హ్యాట్రిక్ విజయం

బెంగళూరు వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు ఆర్సిబి ఓపెన్ పార్థివ్ పటేల్ మిడిల్ ఆర్డర్ లో డివిలియర్స్, స్టోయినీస్ రాణించడంతో 202 పరుగుల భారీ సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్య చేధనను ఆరంభించిన పంజాబ్ ఓపెనర్లు కెఎల్ రాహుల్, గేల్ లు శుభారంభాన్నిచ్చారు. మిడిల్ ఆర్డర్ లో పూరన్ కూడా మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఓ దశలో పంజాబ్ గెలుపు దిశగా అడుగులేసింది. అయితే ఆర్సిబి బౌలర్ ఒకే ఓవర్లో పూరన్, మిల్లర్లను ఔట్ చేసి మ్యాచ్ ను ఆర్సిబి వైపు తిప్పాడు. చివర్లో పంజాబ్ బ్యాట్ మెన్స్ ని వరుసగా ఔటై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగారు.. దీంతో ఆర్సిబి 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ipl 2019; bangalore vs punjab match updates
Author
Bangalore, First Published Apr 24, 2019, 8:17 PM IST

బెంగళూరు వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు ఆర్సిబి ఓపెన్ పార్థివ్ పటేల్ మిడిల్ ఆర్డర్ లో డివిలియర్స్, స్టోయినీస్ రాణించడంతో 202 పరుగుల భారీ సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్య చేధనను ఆరంభించిన పంజాబ్ ఓపెనర్లు కెఎల్ రాహుల్, గేల్ లు శుభారంభాన్నిచ్చారు. మిడిల్ ఆర్డర్ లో పూరన్ కూడా మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఓ దశలో పంజాబ్ గెలుపు దిశగా అడుగులేసింది. అయితే ఆర్సిబి బౌలర్ ఒకే ఓవర్లో పూరన్, మిల్లర్లను ఔట్ చేసి మ్యాచ్ ను ఆర్సిబి వైపు తిప్పాడు. చివర్లో పంజాబ్ బ్యాట్ మెన్స్ ని వరుసగా ఔటై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగారు.. దీంతో ఆర్సిబి 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

 వరుస ఓటముల తర్వాత గాడిలో పడ్డ ఆర్సిబి వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, సైనీ 2, స్టోయినీస్, మోయిన్ అలీ ఒక్కో వికెట్ తీసి పంజాబ్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. కీలక సమయంలో ఆర్సిబి బౌలర్ సైనీ అద్భుతం చేశాడు. 18 ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి క్రీజులో కుదురుకున్న మిల్లర్, పూరన్ లను ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు గెలుపు అప్పుడే ఖాయమయ్యింది. 

  203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(42 పరుగులు), గేల్(23 పరుగులు) శుభారంభాన్నిచ్చారు. అయితే వారి నిష్క్రమణ తర్వాత కూడా అగర్వాల్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అయితే అతన్ని స్టోయినీస్ పెవిలియన్ కు పంపించాడు. దీంతో 105 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 

పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు బ్యాట్ మెన్స్ అదరగొట్టారు. ఓ వైపు వికెట్లు పడుతున్న మొదట సంయమనంతో ఆడిన మిడిలార్డర్ బ్యాట్ మెన్ ఏబి డివిలియర్స్ చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించాడు. 7 సిక్సర్లు 3 ఫోర్ల సాయంతో కేవలం 44 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అతడికి స్టోయినీస్(34 బంతుల్లో 46 పరుగులు) తోడవడంతో బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. వీరిద్దరు కలిసి విల్జోయిన్‌ వేసిన చివరి ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నారు. 

పంజాబ్ బౌలర్లలో కెప్టెన్ అశ్విన్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి 1 వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అత్యధికంగా షమీ నాలుగు ఓవర్లలో 53, విల్జోయిన్‌ 51, రాజ్ పూత్ 46 పరుగులు ఇచ్చారు. 

 ఆర్సిబి జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో డివిలియర్స్, స్టోయినీస్ ఆదుకున్నారు. దాటిగా ఆడుతూ వేగంగా పరుగులను సాధించడానికి ప్రయత్నిస్తూ  ఓపెనర్ పార్థివ్ పాటిల్ ఔటయ్యాడు. 7 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో కేవలం 24 బంతుల్లోనే 43 పరుగులు చేసిన అతడు మరో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. అంతకు ముందే కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఓపెనర్లిద్దరిని కోల్పోయిన వెంటనే ఆల్ రౌండర్ మోయిన్ అలీ వికెట్ ను కోల్పోయాడు.   

  ఐపిఎల్ 2019 లో ఆరంభం నుండి వరుస ఓటములను చవిచూసిన ఆర్సిబి లీగ్ చివరదశలో గెలుపుబాట పట్టింది. అయితే ఆ జట్టు దాదాపు ప్లేఆఫ్ ఆశలు కోల్పోయిన సమయంలో విజయాల బాట పట్టడం బెంగళూరు అభిమానుల్లో మళ్లీ ఆశలను చిగురింపజేసింది. వరుసగా మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలిస్తే బెంగళూరు జట్టు ఇతర జట్ల పాయింట్స్ ఆధారంగా ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశాలున్నాయి. దీంతో ప్రతి మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో ఆర్సిబి ఆటతీరు సాగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సిబి మొదట బ్యాటింగ్ కు దిగింది. 

ఇరు జట్లు రెండు గత మ్యాచుల్లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాయి. పంజాబ్ జట్టులో కుర్రమ్, హర్‌ప్రీత్ చోటు కోల్పోగా పూరన్ , రాజ్‌పూత్ లు వారి స్థానాల్లో జట్టులోకి వచ్చారు. ఇక ఆర్సిబి జట్టుకు కీలక బౌలర్లు స్టెయిన్,నేగీలు దూరమవగా సౌథీ, సుందర్ లు వారి స్థానాలను ఆక్రమించుకున్నారు. 

 ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థివ్‌ పటేల్‌, ఏబీ డివిలియర్స్‌, స్టోయినిస్‌, అక్షదీప్‌ నాథ్‌, మొయిన్‌ అలీ, వాషింగ్టన్‌ సుందర్, సౌథీ, నవీదీప్‌ సైనీ, ఉమేశ్‌ యాదవ్‌, యజువేందర్ చాహల్‌

పంజాబ్‌ జట్టు:

రవిచంద్రన్ అశ్విన్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, డేవిడ్‌ మిల్లర్‌, మన్‌దీప్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌,  విల్జోయిన్‌, మురుగన్‌ అశ్విన్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, మహ్మద్‌ షమీ

Follow Us:
Download App:
  • android
  • ios