Intinti Gruhalakshmi: తెలుగులో 90వ దశకంలో తన నటనతో యువతరాన్ని ఓ ఊపు ఊపిన ప్రముఖ నటి కస్తూరి ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైంది. 

90వ దశకంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడలో నటించి  దక్షిణాదిలో అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి కస్తూరి ప్రస్తుతం సాయంత్రమైతే చాలు తెలుగు లోగిల్లలోకి  అందరి అభిమానాన్ని పొందుతున్నది. నటితో పాటు సామాజిక కార్యకర్త అయిన కస్తూరి.. తాజాగా  టీమిండియా క్రికెటర్,  ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ అండర్ వేర్ పై సంచలన  కామెంట్స్ చేసింది. తాజాగా అతడు ఓ ప్రముఖ బ్రాండ్ కు చెందిన అండర్ వేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

సాధారణంగా  ఒక స్థాయికి చేరుకున్న తర్వాత క్రికెటర్లు గానీ  ఇలాంటి యాడ్స్ చేయడానికి ఇష్టపడరని.. కానీ  రాహుల్ మాత్రం ధైర్యం చేసి ఈ యాడ్ చేశాడని  తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

కస్తూరి ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘క్రికెటర్లు మాములుగా కోలాలు, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, ఇతర ప్రముఖ బ్రాండ్లకు ఎండార్స్ (ప్రచారం) చేయడమే చూశాం గానీ లో దుస్తులకు  ప్రచారం చేయడానికి సిగ్గుపడుతుంటారు. కానీ రాహుల్ మాత్రం వాటిని ఎలాంటి బెరుకు లేకుండా ధరించాడు.. 

 

Scroll to load tweet…

రాహుల్ ను ఈ బాక్సర్లలో చూడటం చాలా బాగుంది. ఇది పురుషుల దుస్తులకు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకువస్తుందని నమ్ముతున్నాను..’ అని రాసుకొచ్చింది. చివరగా ఇది ఫన్  ను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని చివర్లో డిస్క్లేమర్ లా   పేర్కొనడం గమనార్హం. 

కస్తూరి గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజకీయాలు, కమలహాసన్ పార్టీ తో పాటు సినీ ఇండస్ట్రీలోని సమస్యల మీద కూడా  వ్యాఖ్యానించిన విషయం విదితమే. మరి తాజాగా  ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతటి చర్చకు దారి తీస్తాయో చూడాలి. 

కస్తూరి ప్రస్తుతం తమిళ్ లో విజయ్ ఆంటోని ‘తమిళరసన్’, ‘ఉన్ కాదల్ ఇరుంధాల్’,  ‘సింబా’, ‘గరుడ స్రూతు’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంచి చిత్రాలలో నటిస్తున్నది. తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి  ద్వారా ప్రతి గడపను పలకరిస్తున్నది. 

ఇక కెఎల్ రాహుల్ విషయానికొస్తే.. ఐపీఎల్ లో లీగ్ దశలో సూపర్ విక్టరీస్ తో  ప్లేఆఫ్స్ కు ప్రవేశించిన ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో  జరిగిన మ్యాచ్ లో ఓడింది. తద్వారా  లీగ్ లో ప్రవేశించిన తొలి సీజన్ లోనే కప్ కొట్టాలనే ఛాన్స్ ను మిస్ చేసుకుంది. లక్నో తో పాటు  లీగ్ లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ మాత్రం రాజస్తాన్ రాయల్స్ ను ఫైనల్ లో ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.