విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి వుందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. క్రికెటర్లకు  భద్రతను  పెంచాలని.. స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘావర్గాలు హెచ్చరించాయి.

వెంటనే అప్రమత్తమైన విశాఖ పోలీసులు విశాఖ తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కోస్ట్‌గార్డ్, నేవీలతో పాటు మెరైన్ పోలీసులు తీరాన్ని జల్లెడ పడుతున్నారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి  ఉగ్రవాదులు కుట్రపన్నినట్లుగా నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. జైషే మహ్మద్ సంస్ధకు చెందిన పలువురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

విశాఖ టెస్టులో టీమిండియా విజయానికి చేరువవుతోంది. భారత్ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి కష్టాల్లో పడిండి. ఓవర్‌నైట్ స్కోర్ 11/1తో చివరి రోజు ఆట ప్రారంభించిన సఫారీలు వరుసపెట్టి వికెట్లను చేజార్చుకున్నారు