వన్డే సిరీస్ ఆరంభంలోనే టీమిండియాను గాయాలు స్వాగతం పలికాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన రోహిత్ శర్మ, ఫీల్డింగ్‌కి రాలేదు. రోహిత్ గాయం పరిస్థితిపై స్పష్టత లేకపోయినా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు.

అయ్యర్ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్‌కి తరలించినట్టు తెలిపింది బీసీసీఐ. టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టును కూడా మొదటి వన్డేలో గాయాలు వేధించాయి. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేతికి గాయమైంది.

మోర్గాన్ చేతికి మూడు కుట్లు పడినా, బ్యాటింగ్‌కి వచ్చి 22 పరుగులు చేశాడు. అలాగే సామ్ బిల్లింగ్ కూడా బౌండరీ లైన్ దగ్గర ఫోర్ ఆపబోయి గాయపడ్డాడు. బిల్లింగ్స్ కూడా బ్యాటింగ్‌కి వచ్చి 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.