INDWvsAUSW: ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సెంచరీ.. భారత్‌ ముందు భారీ టార్గెట్

INDWvsAUSW: టీమిండియా – ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో కంగారు జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 119, కెప్టెన్‌ అలిస్సా హీలి 82 ప‌రుగుల‌తో రాణించ‌డంతో భార‌త్ ముందు ఆసీస్ జ‌ట్టు 338 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. 
 

INDW vs AUSW LIVE : Australian cricketer Phoebe Litchfield's century, huge target for India, AUSW 338/7 RMA

India Women vs Australia Women, ODI: ముంబ‌యిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో, చివరి వన్డేలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఆసీస్ యంగ్ ప్లేయ‌ర్ ఫోబీ లిచ్ ఫీల్డ్ అద్భుత సెంచరీ (119) సాధించగా, కెప్టెన్ అలిస్సా హీలీ 85 బంతుల్లో 82 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి వికెట్ కు 189 పరుగులు జోడించి హీలీ, లిచ్ ఫీల్డ్ జోడి వేగంగా పరుగులు చేయడంతో శుభారంభం లభించింది. హీలీ ఔటైన తర్వాత లిచ్ ఫీల్డ్ తన రెండో వన్డే సెంచరీని పూర్తి చేసుకుని 40వ ఓవర్ లో 125 బంతుల్లో 119 పరుగులకే ఔట్ అయింది.

ఫోబీ లిచ్ ఫీల్డ్ ఆసియాలో తొలి వన్డే సిరీస్ ఆడుతూ సిరీస్ లో భారత్ పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. తొలి వన్డేలో 78(89) పరుగులు, రెండో వన్డేలో 63(98) పరుగులు, మూడో వన్డేలో 119(125) పరుగులతో అద‌ర‌గొట్టింది. ఇక ప్రస్తుత మ్యాచ్ లో భార‌త బౌల‌ర్ల‌లో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లు, అమంజోత్ కౌర్ 2 వికెట్లు తీసుకోగా, పూజా వస్త్రాకర్,దీప్తి శర్మలు ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు యాస్తిక భాటియా 6, స్మృతి మంధాన 29 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం భారత్  43/2 (8.2) ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఉన్నారు. 

virat kohli: విరాట్ కోహ్లీ ఎమోష‌న‌ల్.. గ్రౌండ్ లోనే ఇలా.. !

వికెట్ల పతనం: 189-1 ( హీలీ , 28.5), 209-2 ( ఎల్లీస్ పెర్రీ , 32.1), 216-3 ( మూనీ , 35.1), 216-4 ( తహ్లియా మెక్‌గ్రాత్ , 35.2), 256-5 ( ఫోబ్ లిచ్‌ఫీల్డ్ , 2295-6 ), 6 ( సదర్లాండ్ , 45.6), 299-7 ( గార్డనర్ , 46.2)

భార‌త్ టీమ్:

యాస్తికా భాటియా , స్మృతి మంధాన , రిచా ఘోష్ , జెమిమా రోడ్రిగ్స్ , హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ , మన్నత్ కశ్యప్ , అమంజోత్ కౌర్ , పూజా వస్త్రాకర్ , శ్రేయాంక పాటిల్ , రేణుకా ఠాకూర్ సింగ్  

ఆస్ట్రేలియా టీమ్: 

ఫోబ్ లిచ్‌ఫీల్డ్ , అలిస్సా హీలీ, , ఎల్లీస్ పెర్రీ , బెత్ మూనీ , తహ్లియా మెక్‌గ్రాత్ , ఆష్లీ గార్డనర్ , అన్నాబెల్ సదర్లాండ్ , జార్జియా వేర్హామ్ , అలనా కింగ్ , కిమ్ గార్త్ , మేగాన్ షట్

ఒలింపిక్స్ నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు.. 2024లో టాప్-10 స్పోర్ట్స్ ఈవెంట్‌లు ఇవే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios