Asianet News TeluguAsianet News Telugu

బాల్ ఆఫ్ ది సెంచరీ.. శిఖ పాండే బంతికి నెటిజన్స్ ఫిదా.. వసీం అక్రమ్ తో పోల్చుతున్న అభిమానులు

Shikha Pandey: భారత్ ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. కానీ శిఖ పాండే బౌలింగ్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

Indw vs Ausw: indian bowler shikha pandeys ball of the century sends twitter into a frenzy, watch the video here
Author
Hyderabad, First Published Oct 10, 2021, 11:37 AM IST

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మహిళల టీ20 సిరీస్ లో భారత్ అనూహ్య ప్రదర్శనతో అదరగొడుతున్నది. మ్యాచ్, సిరీస్ ఫలితం ఎలా ఉన్నా భారత మహిళా క్రికెటర్లు మునపటి కంటే అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తున్నారు. తాజాగా Australia తో జరిగిన రెండో T20లో India 5 వికెట్ల తేడాతో ఓడిపోయినా బౌలర్లు మాత్రం ఆసీస్ బ్యాటర్స్ కు చుక్కలు చూపించారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన IndW.. నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు అద్భుతమైన బంతులు వేశారు. ముఖ్యంగా తొలి ఓవర్లోనే  శిఖ పాండే వేసిన రెండో బంతి అయితే నభూతో నభవిష్యత్.

 

ఆఫ్ స్టంప్ లైన్ లో పడ్డ ఆ ఇన్ స్వింగర్.. వికెట్లకు దూరంగా వెళ్తుందేమో అనిపించింది. కానీ అనూహ్యంగా టర్న్ తీసుకుంటూ ఆసీస్ ఓపెనర్ హీలి వికెట్లను పడగొట్టింది. దీంతో ఆశ్చర్యపోవడం హీలి వంతైంది. కాగా ఈ బంతి  విసిరిన శిఖ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్థాన్ లెజెండరీ బౌలర్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ తో Shikha Pandeyను పోల్చుతున్నారు. 

 

Wasim akram.. 1992 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ క్రిస్ లూయిస్ కు విసిరిన అద్భుతమైన ఇన్ స్వింగర్ తో శిఖ పాండే బంతిని పోలుస్తున్నారు. అంతేగాక ఇంగ్లండ్ లో షేన్ వార్న్ వేసిన అద్భుతమైన డెలివరీ ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  మరి ఆ అద్భుతాన్ని మీరు కూడా వీక్షించేయండి. 

Follow Us:
Download App:
  • android
  • ios