Asianet News TeluguAsianet News Telugu

Indw vs Ausw: దంచికొట్టిన భారత అమ్మాయిలు.. రెచ్చిపోయి ఆడిన రోడ్రిగ్స్.. కరుణించని కాలం..

Indw vs Ausw: ఇటీవలే  గులాబి టెస్టులో ఇరగదీసిన భారత మహిళల జట్టు తాజాగా అదే స్థాయి ప్రదర్శనను టీ20ల్లోనూ రిపీట్ చేసింది.  ప్రపంచ ఛాంపియన్లుగా విర్రవీగుతున్న ఆస్ట్రేలియా బౌలర్లకు పట్టపగలే చుక్కల్ని చూపించింది. 

indw vs ausw: first t20 between india va australia abandoned due to rain
Author
Hyderabad, First Published Oct 7, 2021, 5:20 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అమ్మాయిలు ఇరగదీశారు. వన్డే సిరీస్ ఓడిపోయినా.. ఆ తర్వాత జరిగిన డే అండ్ నైట్ టెస్టులో అదరగొట్టిన భారత అమ్మాయిలు... తాజాగా తొలి టీ20 లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ పేస్ బలగం గజ గజ వణికింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా  వర్షం కారణంగా తొలి T20 రద్దైనా భారత్ భారీ స్కోరు సాధించింది. 

క్వీన్స్లాండ్ లోని కరెర ఓవల్ గ్రౌండ్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో.. 15.2 ఓవర్లలోనే ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆసీస్.. బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు స్మృతి మంధాన (10 బంతుల్లో 17), షెఫాలి వర్మ (14 బంతుల్లో 18) త్వరగానే అవుటయ్యారు. అయితే షెఫాలి వర్మ చేసిన 18 పరుగులు. 3 సిక్స్ ల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం. 

 

ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జెమీ రొడ్రిగ్స్.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 36 బంతుల్లోనే ఏడు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. రొడ్రిగ్స్ కు తోడుగా యస్తిక భాటియా (15) , రిచా ఘోష్ (17) కూడా రాణించడంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (12) మూడు ఫోర్లతో తన ఉద్దేశం చాటినా త్వరగానే ఔటై నిరాశపరిచింది. భారీ స్కోరు దిశగా సాగుతున్న  భారత బ్యాటర్ల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. నిరాటంకంగా వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. సిరీస్ లో తదుపరి మ్యాచ్ శనివారం మధ్యాహ్నం జరుగనున్నది. భారత బ్యాటర్ల ధాటికి ఆస్ట్రేలియా బౌలర్లలో Molineux 2 ఓవర్లకే 23 పరుగులు సమర్పించుకోగా.. గార్డ్నర్, వ్లామింక్ కూడా భారీగా పరుగులు ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios