Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్‌తో రెండో టీ20 మ్యాచ్... ఆఖరి ఓవర్‌ వరకూ పోరాడి ఓడిన టీమిండియా...

రెండో టీ20లో ఆసీస్ ఉత్కంఠ విజయం... 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా జట్టు... మూడు వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్...

INDW vs AUSW 2nd T20I: Australia Women beats Indian Women with 4 wickets
Author
India, First Published Oct 9, 2021, 5:14 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో భారత మహిళా జట్టు, రెండో టీ20 మ్యాచ్‌లో పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగలిగింది.

టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన 1, షెఫాలీ వర్మ 3, జెమీమా రోడ్రిగ్స్ 7, యషికా భాటియా 8, రిచా ఘోష్ 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసింది...

లోయర్ ఆర్డర్‌లో దీప్తి శర్మ 16, పూజా వస్తాకర్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా...119 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆరంభంలో గట్టి షాక్ తగిలింది.

వికెట్ కీపర్ ఆలీసా హేలీని 4 పరుగులకే బౌల్డ్ చేసింద శిఖా పాండే. కెప్టెన్ మెగ్ లానింగ్ 15, బెత్ మూనీ 34 పరుగులు చేయగా 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను తహిలా మెక్‌గ్రాత్ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించింది...

33 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసిన తహిలా మెక్‌గ్రాత్‌కి తోడు జార్జియా వారేహం 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి ఆస్ట్రేలియాకి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు... భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4 ఓవరల్లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.

ఇరుజట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్, ఆదివారం అక్టోబర్ 10న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే..

Follow Us:
Download App:
  • android
  • ios