India vs West Indies 3rd T20I: టాపార్డర్‌లో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ... సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, మెరుపులు మెరిపించిన వెంకటేశ్ అయ్యర్...
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయిన మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ రాణించి భారత జట్టుకి మంచి స్కోరు అందించారు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత మొదటిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో మేయర్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది వన్ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసి హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మూడో టీ20లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్, 31 బంతుల్లో 34 పరుగులు చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... ఈ సిరీస్‌లో మొత్తంగా 71 పరుగులు చేసిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్ట్రైయిక్ రేటు కేవలం 85.5 మాత్రమే. టీమిండియా తరుపున టీ20ల్లో ఇది రెండో అత్యల్పం...
2010 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మురళీ విజయ్ 83.8 స్ట్రైయిక్ రేటు తర్వాత టీమిండియా తర్వాత టీ20 సిరీస్‌లో అత్యల్ప స్ట్రైయిక్ రేటు ఉన్న టాపార్డర్ బ్యాటర్ ఇషాన్ కిషనే... నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, 15 బంతుల్లో 7 పరుగులు చేసి డొమినిక్ డ్రేక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్ 3 కంటే కింద బ్యాటింగ్‌కి వచ్చిన గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో 30+ స్కోరు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కలిసి భారీ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...
సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో ఓ ఫోర్, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ కాగా వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్‌కి టీ20ల్లో ఇదే అత్యుత్తమ స్కోరు...
సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కలిసి 37 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా ఆఖరి 5 ఓవర్లలో 86 పరుగులు రాబట్టింది భారత జట్టు. టీ20ల్లో ఆఖరి ఐదు ఓవర్లలో టీమిండియాకి ఇదే అత్యధికం. 2007లో ఇంగ్లాండ్‌పై ఆఖరి ఐదు ఓవర్లలో రాబట్టిన 80 పరుగుల రికార్డును అధిగమించింది సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ జోడీ...
