Asianet News TeluguAsianet News Telugu

కేల్ మేయర్స్ హాఫ్ సెంచరీ! హార్ధిక్ పాండ్యా రికార్డు ఫీట్... మూడో టీ20లో టీమిండియా ముందు...

హాఫ్ సెంచరీతో వెస్టిండీస్‌ని ఆదుకున్న కేల్ మేయర్స్... మూడో టీ20లో టీమిండియా ముందు 165 పరుగుల టార్గెట్.. 

INDvsWI 3rd T20I: Kyle Mayers Half century, West Indies scored decent total
Author
India, First Published Aug 2, 2022, 11:14 PM IST

టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల ఓ మాదిరి స్కోరు చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అయితే భువీ వేసిన రెండో ఓవర్‌లో 6 పరుగులు రాబట్టిన విండీస్ ఓపెనర్లు, ఆవేశ్ ఖాన్‌ని మరోసారి టార్గెట్ చేస్తూ మూడో ఓవర్‌లో 15 పరుగులు రాబట్టారు...

ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓక్క ఫోర్ ఇచ్చాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది వెస్టిండీస్. 20 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్‌ని హార్ధిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్‌తో టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు హార్ధిక్ పాండ్యా...

టీ20ల్లో 800లకు పైగా పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, 50 వికెట్లు తీసి.. భారత జట్టు తరుపున 500+ పరుగులు, 50+ వికెట్లు తీసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. భారత జట్టు తరుపున టీ20ల్లో 50+ వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా...

ఇంతకుముందు యజ్వేంద్ర చాహాల్ 79 వికెట్లతో టాప్‌లో ఉంటే భువనేశ్వర్ కుమార్ 73, జస్ప్రిత్ బుమ్రా 69, రవిచంద్రన్ అశ్విన్ 64, రవీంద్ర జడేజా 50 వికెట్లతో హార్ధిక్ పాండ్యా కంటే ముందున్నారు. 

అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్ ఇచ్చిన క్యాచ్‌ని రోహిత్ శర్మ జారవిడిచాడు... అయితే తనకి దక్కిన లైఫ్‌ని సరిగ్గా వినియోగించుకోలేకపోయిన విండీస్ కెప్టెన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసిన కేల్ మేయర్స్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లోనే రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన సిమ్రాన్ హెట్మయర్ 17 పరుగులు రాబట్టాడు. గత మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 10 పరుగులను కట్టడి చేయలేక విమర్శలు ఎదుర్కొన్న ఆవేశ్ ఖాన్, నేటి మ్యాచ్‌లో 3 ఓవర్లో 47 పరుగులు సమర్పించి చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు...

20వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో రెండు వరుస ఫోర్లు బాదిన రోవ్‌మెన్ పావెల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  ఆ తర్వాత రెండో బంతికి 12 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు...
 

Follow Us:
Download App:
  • android
  • ios