INDvsWI 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా... వన్డే వరల్డ్ కప్‌కి ప్రిపరేషన్ మొదలు..
వెస్టిండీస్‌తో మొదటి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.... వెస్టిండీస్ బ్యాటింగ్, ముకేశ్ కుమార్‌కి అవకాశం..

వెస్టిండీస్ టూర్‌లో భాగంగా నేటి నుంచి వన్డే సిరీస్‌లో పాల్గొంటోంది భారత జట్టు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
టెస్టు సిరీస్‌ని 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ వన్డే సిరీస్‌ని చూస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో అదరగొట్టారు. అయితే శుబ్‌మన్ గిల్, టెస్టు సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
ఈ ఏడాది వన్డేల్లో దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చిన శుబ్‌మన్ గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ పర్ఫామెన్స్ కూడా బాగుంటే, అతను టాప్ 5లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇప్పటికే వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌తో సంజూ శాంసన్ పోటీపడబోతున్నాడు.
ఇషాన్ కిషన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం దాదాపు ఖాయమే. కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ మధ్యే వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం పోటీ జరగొచ్చు. కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నా, వికెట్ కీపింగ్ చేసేందుకు ఫిట్‌గా లేకపోతే మాత్రం అప్పుడు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య పోటీ ఉంటుంది.
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకునేందుకు సంజూ శాంసన్‌కి ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం. నిలకడలేమికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంజూ శాంసన్, గత ఏడాది వన్డేల్లో ఆడినంత వరకూ బాగానే ఆడాడు.. అయితే తొలి వన్డేలో ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూ శాంసన్‌ని పట్టించుకోలేదు..
మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో వన్డే సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్, జయ్‌దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా మిగిలారు. రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, నేటి మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు..
నేటి మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అప్పుడెప్పుడో 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఫ్లైట్ లేటు అయ్యాడని సిమ్రాన్ హెట్మయర్‌ని పక్కనబెట్టేసిన వెస్టిండీస్, 2023 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో కూడా అతన్ని ఆడించలేదు. హెట్మయర్‌ని పక్కనబెట్టినందుకు ఈ రెండు టోర్నీల్లోనూ భారీ మూల్యం చెల్లించుకున్న వెస్టిండీస్ మేనేజ్‌మెంట్, మొత్తానికి బుద్ధి తెచ్చుకుని.. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది..
వెస్టిండీస్ జట్టు: కైల్ మేయర్స్, షై హోప్, బ్రెండన్ కింగ్, అలిక్ అతనజే, సిమ్రాన్ హెట్మయర్, రోవ్‌మెన్ పావెల్, రొమారియో షెఫర్డ్, ఎన్నిక్ కరియా, డొమినిక్ డ్రాక్స్, జేడన్ సీల్స్, గుడకేష్ మోటీ
భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్