Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన స్పిన్నర్లు.. కుల్దీప్ మాయకు లంక గజగజ

INDvsSL Live: భారత్-శ్రీలంక మధ్య  ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా) వేదికగా జరుగుతున్న  రెండో వన్డేలో  టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక నిలకడగా ఆడినా స్పిన్నర్ల వలలో చిక్కుకుంది. 

INDvsSL Live: Kuldeep  Yadav Strikes Thrice,  Sri Lanka collapse at Kolkata
Author
First Published Jan 12, 2023, 3:33 PM IST

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న  రెండో వన్డేలో  శ్రీలంక తొలుత  నిలకడగా బ్యాటింగ్ చేసినా తర్వాత తడబడుతోంది. టీమిండియా పేసర్లను లంక బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కుని ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ..  స్పిన్నర్లకు బంతిని అందించాడు.  కుల్దీప్ తో పాటు  అక్షర్ పటేల్ భారత్ కు బ్రేక్ ఇచ్చారు. కుల్దీప్ కీలక భాగస్వామ్యాన్ని  విడదీయగా.. అక్షర్ కూడా  ఓ చేయి వేశాడు.   ప్రస్తుతం లంక  26 ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శుభారంభం చేసింది.  ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 20, 4 ఫోర్లు)  దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు.  షమీ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని బౌండరీ దాటించిన అవిష్క.. సిరాజ్ బౌలింగ్ లో   హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు.  కానీ సిరాజ్ వేసిన  లంక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో  చివరి బంతికి అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

తన కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న   నువానిదు ఫెర్నాండో (63 బంతుల్లో 50, 6 ఫోర్లు) తో కలిసి కుశాల్ మెండిస్ (34 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్సర్)  రాణించాడు.  ఉమ్రాన్ మాలిక్ వేసిన 12వ ఓవర్లో కుశాల్.. మూడు ఫోర్లు బాదాడు.  ఫెర్నాండో, మెండిస్ కలిసి రెండో వికెట్ కు 73 పరుగులు జోడించారు.  15 ఓశవనర్లు ముగిసేసరికి లంక స్కోరు 1 వికెట్ నష్టానికి 88 పరుగులు.  

డ్రింక్స్ తర్వాత  రోహిత్ శర్మ..  కుల్దీప్ కు బంతినిచ్చాడు. 17వ ఓవర్ చివరి బంతికి కుల్దీప్.. కుశాల్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు.  ఆ తర్వాత ఓవర్లోనే అక్షర్ పటేల్.. ధనంజయ డిసిల్వ (0) ను క్లీన్ బౌల్డ్ చేశాడు.  వికెట్లు పడుతున్నా నిలకడగా బ్యాటింగ్ చేసిన నువానిదు ఫెర్నాండో.. కుల్దీప్ వేసిన  21వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి  హాఫ్ సెంచరీ సాధించాడు.  తర్వాత అక్షర్ పటేల్  వేసిన 22వ ఓవర్ తొలి బంతికి  ఫెర్నాండో.. రనౌట్ అయ్యాడు.  అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన లంక సారథి  దసున్ శనక (2)ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. అదే ఊపులో కుల్దీప్.. అసలంక (15) ను కూడా ఔట్ చేసి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. క్రీజులో హసరంగ, వెల్లలగె ఉన్నారు. 

 

17 ఓవర్లకు 102-2గా ఉన్న లంక.. ఐదు ఓవర్ల వ్యవధిలోనే ఐదు కీలక వికెట్లను కోల్పోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios