Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకు భారీ షాక్.. రోహిత్, కోహ్లీ ఔట్.. 86 పరుగులకే 4 వికెట్లు

INDvsSL Live: భారత్ - శ్రీలంక మధ్య  ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో లంక నిర్దేశించిన  స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  భారత బ్యాటర్లు తడబడుతున్నారు. టీమిండియా ఇప్పటికే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 

INDvsSL Live: Early Strikes Suffers Team India in Eden Gardens, Top 3 Batters Went To Pavilion
Author
First Published Jan 12, 2023, 6:30 PM IST

తొలి వన్డేలో పరుగుల వరద పారించిన టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రెండో వన్డేలో మాత్రం తేలిపోయారు. ఈడెన్ గార్డెన్స్ వదికగా జరుగుతన్న  రెండో వన్డేలో  స్వల్ప లక్ష్యాన్ని   సాధించే క్రమంలో టీమిండియా తడబడుతోంది.  86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.  రోహిత్ శర్మ (17), శుభమన్ గిల్ (21) లతో పాటు విరాట్ కోహ్లీ (4) కూడా  త్వరగానే వెనుదిరిగాడు.  ఫలితంగా భారత్ ఆత్మరక్షణలో పడింది.  ఆదుకుంటాడనుకున్న శ్రేయాస్ అయ్యర్ (28) కూడా  పెవిలియన్ చేరాడు. 

216 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన భారత ఇన్నింగ్స్ దాటిగానే ఆరంభమైంది.  రోహిత్ శర్మ రెండో బంతికే  బౌండరీ కొట్టాడు. రెండో ఓవర్ వేసిన లాహిరు కుమార బౌలింగ్ లో కూడా శుభమన్ గిల్ కూడా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు.  రజిత వేసిన మూడో  ఓవర్లో  రోహిత్, గిల్ చెరో  ఫోర్ కొట్టారు.  

కుమార వేసిన భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సిక్సర్ బాదిన  రోహిత్.. చమీకర కరుణరత్నే వేసిన ఐదో ఓవర్ లో చివరి బంతికి  వికెట్ కీపర్  కుశాల్ మెండిస్ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  కుమార వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన గిల్.. మూడో బంతికి అవిష్క ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 

వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ కూడా కుమార  వేసిన పదో ఓవర్   మూడో బంతికి క్లీన్  బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్.. 67 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.   

ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెఎల్ రాహఉల్  తో కలిసి శ్రేయాస్ అయ్యర్ ఇండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నాడు.   కరుణరత్నే వేసిన 11వ ఓవర్లో  శ్రేయాస్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదాడు.  శ్రేయాస్ బలహీనతను పసిగట్టిన శనక.. స్పిన్నర్ హసరంగను రంగంలోకి దింపాడు.  అయితే హసరంగను ఎదుర్కున్న శ్రేయాస్.. కసున్  రజిత వేసిన 15వ ఓవర్లో రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆదుకుంటాడనుకున్న అయ్యర్ కూడా వెనుదిరగడంతో భారత్  కష్టాల్లో పడింది. 

 

ప్రస్తుతం 14వ ఓవర్ ముగిసేసరికి భారత  జట్టు స్కోరు.. 3 వికెట్ల నష్టానికి  86 గా ఉంది.  విజయానికి  మరో 131 పరుగులు కావాలి.  ప్రస్తుతం ఆడుతున్న రాహుల్ (8 బ్యాటింగ్) ,  హార్ధిక్ పాండ్యా (0 బ్యాటింగ్) తో పాటు అక్షర్ పటేల్  మాత్రమే బ్యాటింగ్  చేయగలరు. మరి ఈ మ్యాచ్ లో ఫ్లడ్ లైట్ల వెలుగులో భారత్ ఏం చేస్తుందో..? 

Follow Us:
Download App:
  • android
  • ios