Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 1st ODI: టాస్ గెలిచిన సౌతాఫ్రికా... కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ...

India vs South Africa 1st ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా... కెప్టెన్‌గా కెఎల్ రాహుల్...వెంకటేశ్ అయ్యర్‌కి వన్డే ఆరంగ్రేటం...

INDvsSA 1st ODI: South Africa won the toss and elected bat first, KL Rahul lead Team India
Author
India, First Published Jan 19, 2022, 1:35 PM IST

టీమిండియాతో జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత ఫీల్డింగ్ చేయనుంది. 
సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్ గెలవాలనే కోరికను నెరవేర్చుకోలేకపోయిన భారత జట్టు, వన్డే సిరీస్‌ గెలిచి స్వదేశానికి తిరిగి రావాలని చూస్తోంది... వరుసగా 8 మ్యాచుల్లో టాస్ గెలిచిన భారత జట్టు, నేటి మ్యాచ్‌లో టాస్ ఓడిపోయింది...

సఫారీ టూర్‌ 2021-22లో టీమిండియా టాస్ ఓడిపోవడం ఇదేే తొలిసారి.  రోహిత్ శర్మ గాయం కారణంగా సౌతాఫ్రకా టూర్‌కి దూరంగా ఉండడంతో ఈ వన్డే సిరీస్‌కి యంగ్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

టీ20 కెప్టెన్సీ, టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన విరాట్ కోహ్లీ, బీసీసీఐ సెలక్టర్ల కారణంగా వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో ఓ ప్లేయర్‌గా బరిలో దిగబోతున్నాడు విరాట్ కోహ్లీ...

కెప్టెన్ కెఎల్ రాహుల్ అయినప్పటికీ, అతని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడనేది ఆసక్తికర అంశంగా మారింది. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన వెంకటేశ్ అయ్యర్, నెల రోజుల వ్యవధిలో వన్డేల్లోనూ ఎంట్రీ ఇవ్వనున్నాడు...

మొదటి టెస్టు ఓడిన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికా, వన్డేల్లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తోంది. తెంప భవుమా కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన సౌతాఫ్రికా, వన్డే సిరీస్‌లోనూ అదే జోరూ చూపించాలని భావిస్తోంది...

మొదటి టెస్టు ఓటమి తర్వాత టెస్టు రిటైర్మెంట్ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్, వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ద్వారా నాలుగేళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వన్డే జట్టలో దక్కించుకున్నాడు. 

రుతురాజ్ గైక్వాడ్ రూపంలో యంగ్ ఓపెనర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి తుదిజట్టులో చోటు దక్కడం విశేషం. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్‌కి రానున్నారు. భువీ, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు వెంకటేశ్ అయ్యర్‌ను పార్ట్ టైం పేస్ బౌలర్‌గా వాడే అవకాశం ఉంది.

సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జన్నెమన్ మలాన్, అయిడిన్ మార్క్‌రమ్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, తెంబ భవుమ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అదిల్ ఫుహ్లుక్వాయో, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తాబ్రేజ్ షంసీ, లుంగీ ఇంగిడీ

 

భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్

Follow Us:
Download App:
  • android
  • ios