Asianet News TeluguAsianet News Telugu

గిల్ అన్‌స్టాపబుల్.. రికార్డుల దుమ్ము దులుపుతున్న టీమిండియా ఓపెనర్..

INDvsNZ 3rd ODI Live: ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో ఓనమాలు దిద్దుతున్న  టీమిండియా యువ ఓపెనర్  శుభ్‌మన్ గిల్   సూపర్ ఫామ్ తో  రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు.  తాజాగా కివీస్ తో మ్యాచ్  లో కూడా సెంచరీ చేశాడు. 

INDvsNZ Live: Shubman Gill Surpasses Shikhar Dhawan in Quickest Centuries Record MSV
Author
First Published Jan 24, 2023, 3:58 PM IST

70, 21, 116, 208, 40 నాటౌట్, 112.. గడిచిన ఆరు ఇన్నింగ్స్ లలో  శుభ్‌మన్ గిల్   ఆడిన వన్డే ఇన్నింగ్స్ లలో స్కోర్లు అవి. ఈ గణాంకాలు చూస్తేనే తెలుస్తున్నది గిల్ పరుగుల దాహం ఎంత ఉందనేది. ఏడాదికాలంగా  వన్డేలలో నిలకడగా రాణిస్తూ  తాజాగా  టీమిండియా కెప్టెన్, మేనేజ్మెంట్ సపోర్ట్ తో   రోహిత్ తో కలిసి ఓపెనర్ గా వస్తున్న  గిల్..  అన్‌స్టాపబుల్ లా దూసుకుపోతున్నాడు.  న్యూజిలాండ్ తో సిరీస్ లో ఇప్పటికే  ఓ డబుల్ సెంచరీ బాదిన ఈ పంజాబ్ కుర్రాడు.. తాజాగా  ఇండోర్ లో కూడా  శతకం (112)  సాధించాడు. తద్వారా పలు రికార్డులను బ్రేక్ చేశాడు. 

న్యూజిలాండ్ తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో గిల్..    ఆది నుంచి దూకుడుగానే ఆడాడు.  ఒక ఎండ్ లో రోహిత్ నెమ్మదిగా ఆడినా ఈ కుర్రాడు మాత్రం   బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.  33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు..  84 బంతుల్లో  శతకం బాదాడు. వన్డేలలో  గిల్ కు ఇది నాలుగో సెంచరీ. 

అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 4 సెంచరీలు.. 

ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా గిల్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ లో నాలుగు సెంచరీలు చేసిన బ్యాటర్లలో  భారత్ నుంచి గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. గతంలో  శిఖర్ ధావన్.. 24 ఇన్నింగ్స్ లలో  4 సెంచరీలు చేశాడు. గిల్ మాత్రం 21 ఇన్నింగ్స్ లలోనే  నాలుగు శతకాలు బాదాడు.  ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఇమామ్ ఉల్ హక్ (9 ఇన్నింగ్స్), క్వింటన్ డికాక్ (16 ఇన్నింగ్స్), డెన్నిస్ అమిస్ (18 ఇన్నింగ్స్)లు గిల్ కంటే ముందున్నారు.  

ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు 

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో  భాగంగా  అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో  గిల్.. బాబర్ ఆజమ్ రికార్డును సమం చేశాడు. బాబర్.. 2016లో  వెస్టిండీస్ మీద మూడు మ్యాచ్ లలో 360 పరుగులు చేశాడు.  తాజాగా గిల్ కూడా అంతే పరుగులు  చేశాడు. గిల్.. బంగ్లా  బ్యాటర్ ఇమ్రుల్ కయేస్ (జింబాబ్వే పై 349 రన్స్), క్వింటన్ డికాక్ (ఇండియాపై 342), మార్టిన్ గప్తిల్ (ఇంగ్లాండ్ పై 330 రన్స్) ల రికార్డులను తుడిచేశాడు. 

 

కివీస్ తో సిరీస్ లోనే భాగంగా గిల్..  హైదరాబాద్ లో ముగిసిన తొలి మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా  వన్డేలలో భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్  (19) లలో వెయ్యి పరుగులు సాధించిన  బ్యాటర్ గా గిల్ రికార్డులకెక్కాడు.  గతంలో  ధావన్,  కోహ్లీలకు ఈ ఫీట్ సాధించడానికి  24 ఇన్నింగ్స్ అవసరం పడ్డాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios