Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 3rd T20I: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, దీపక్ చాహార్ మెరుపులు... టీమిండియా భారీ స్కోరు...

India vs New Zealand: హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ... మూడు వికెట్లు తీసిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్... మరోసారి విఫలమైన భారత మిడిల్ ఆర్డర్...

INDvsNZ 3rd Test: Rohit Sharma Captain Innings, Middle order failed to score decent total
Author
India, First Published Nov 21, 2021, 8:49 PM IST

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది... ఓపెనర్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్, ఇషాన్ కిషన్ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసే సమయానికే 69 పరుగులు చేసింది భారత జట్టు. ఫర్గూసన్ వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు రాబట్టారు రోహిత్, ఇషాన్ కిషన్...

ఏడో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మిచెల్ సాంట్నర్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియాకి షాక్ ఇచ్చాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

Read: రోహిత్ శర్మ సక్సెస్‌కి ఆ ఆస్ట్రేలియా ప్లేయరే కారణం... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్, నాలుగు బంతులు ఎదుర్కొన్నా పరుగులేమీ చేయకుండా, గప్టిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లోనే జేమ్స్ నీశమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

6 ఓవర్లు ముగిసేసరికి 69/0 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించిన భారత జట్టు, వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 83/3 స్కోరుకి చేరుకుంది. ఈ దశలో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ...

టీ20ల్లో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్ (161 సిక్సర్లు) తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 

ఈ టీ20 సిరీస్‌లో రోహిత్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా, కెరీర్‌లో 30వ 50+ స్కోరు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక 50+ పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ (29 హాఫ్ సెంచరీలు) రికార్డును అధిగమించి, టాప్‌లోకి దూసుకెళ్లాడు రోహిత్ శర్మ...

31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చసిన రోహిత్ శర్మ, ఇష్ సోధీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఐదో వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఛాప్‌మన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ఆ తర్వాత రెండో బంతికే శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ చేరాడు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను మిల్నే అవుట్ చేశాడు...

Read Also: ఈ మాత్రం దానికి వరల్డ్ కప్ టోర్నీ ఎందుకు... టాస్ గెలిచిన వాళ్లకు టైటిల్ ఇచ్చేస్తే, సరిపోయేదిగా...

రోహిత్ వికెట్ తీసిన ఇష్ సోధీ, టీమిండియాపై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. సోధీ టీమిండియాపై టీ20ల్లో 19 వికెట్లు తీయగా, మిచెల్ సాంట్నర్ 16, టిమ్ సౌథీ 15 వికెట్లతో టాప్ 3లో న్యూజిలాండ్ బౌలర్లే ఉండడం విశేషం...

11 బంతుల్లో ఓ సిక్సర్, 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన హర్షల్ పటేల్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 162 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది భారత జట్టు... ఆఖరి ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదిన దీపక్ చాహార్, ఆ తర్వాత సిక్సర్‌తో 19  పరుగులు రాబట్టడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది టీమిండియా...  8 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు దీపక్ చాహార్...


 

Follow Us:
Download App:
  • android
  • ios