Asianet News TeluguAsianet News Telugu

కివీస్‌ను పొట్టి పట్టు పట్టాలిక..! తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా..

INDvsNZ T20I Live: స్వదేశంలో కివీస్ ను  వన్డేలలో  క్లీన్  స్వీప్ చేసిన భారత్  నేటి  నుంచి ఆ జట్టుతో  పొట్టి ఫార్మాట్ లో  తలపడబోతున్నది. రాంచీ (జార్ఖండ్) వేదికగా జరుగుతున్న తొలి టీ20లో  భారత్ టాస్ గెలిచింది. 

INDvsNZ 1st T20I Live: India Won The Toss Elects Bowl First
Author
First Published Jan 27, 2023, 6:36 PM IST

ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో  ముగిసిన  టీ20,  వన్డే సిరీస్ లు నెగ్గిన  భారత జట్టు.. తర్వాత  న్యూజిలాండ్ ను కూడా చిత్తు చేసింది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ ను  3-0 తో నెగ్గిన   టీమిండియా.. ఇప్పుడు  టీ20 సమరానికి సిద్ధమైంది. జార్ఖండ్ రాజధాని  రాంచీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో ఇరు జట్లు తలపడుతున్నాయి. రాంచీలోని  జార్ఖండ్  స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జెఎస్సీఏ) ఇంటర్నేషనల్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి తొలుత  బౌలింగ్ ఎంచుకుంది.  రాంచీ టీ20లో భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్,  పృథ్వీ షా ఆడటం లేదు. 

నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగానే హార్ధిక్ పాండ్యా.. ఓపెనర్లుగా గిల్ -ఇషాన్ లకే ఓటు వేశాడు.  చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షా కు నిరాశ తప్పలేదు. కుల్దీప్ - చాహల్ లలో ఎవర్నో ఒకరిని ఎంచుకోవాల్సి రాగా పాండ్యా.. కుల్దీప్ కే తుది జట్టులో అవకాశమిస్తున్నాడు. 

ఈ ఏడాది శ్రీలంక తో టీ20 సిరీస్ నుంచి  రెగ్యులర్ ఓపెనర్ గా మారిన గిల్..  టీ20లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా వన్డేలలో మాత్రం రఫ్ఫాడించాడు.  ఆరు వన్డేల వ్యవధిలోనే మూడు సెంచరీలు బాదాడు. అతడి సహచరుడు ఇషాన్ కిషన్  బంగ్లాదేశ్ తో  చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేసినా తర్వాత అంతగా ఆకట్టుకోలేదు. ఈ ఇద్దరు  నేటి మ్యాచ్ లో ఎలా ఆడతారో చూడాలి.  ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకపోవడంతో భారత జట్టు   సూర్యకుమార్ యాదవ్ మీద  మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. వీరికి తోడు దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యాలు  బ్యాటింగ్ లో రాణిస్తేనే భారత్ కు  కలిసొస్తుంది.  

వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కివీస్  బ్యాటింగ్ లోతు ఏంటో భారత్ కు అర్థమయ్యే ఉంటుంది.  డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్ తో పాటు ఆరో స్థానంలో వచ్చి మెరుపులు మెరిపించే  మైఖేల్ బ్రాస్‌వెల్ తో పాటు సారథి మిచెల్ సాంట్నర్ కూడా  బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించగల సత్తా ఉన్నోడే.  వీరిని  అడ్డుకోవాలంటే భారత బౌలర్లు చెమటోడ్చాల్సిందే.. 

తుది జట్లు : 

భారత్ :  శుభమన్ గిల్,  ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి,  సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్,  కుల్దీప్ యాదవ్


న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, జాకబ్ డఫ్ఫీ, బ్లయర్ టిక్నర్

Follow Us:
Download App:
  • android
  • ios