Asianet News TeluguAsianet News Telugu

దంచికొట్టిన కాన్వే, మిచెల్.. విఫలమైన టీమిండియా పేసర్లు.. రాంచీ టీ20లో భారత్ ముందు భారీ టార్గెట్

INDvsNZ 1st T20I Live: రాంచీ టీ20లో  న్యూజిలాండ్ బ్యాటర్లు  తొలుత రెచ్చిపోయారు. ఓపెనర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ లు రాణించారు. చివర్లో డారిల్ మిచెల్ దూకుడుగా ఆడాడు.

INDvsNZ 1st T20I Live: India Need To Chase 177 Runs in Ranchi
Author
First Published Jan 27, 2023, 8:43 PM IST

వన్డే సిరీస్ లో  ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదన్న కసో మరో ఏమో గానీ పేసర్లకు ఏమాత్రం అనుకూలించని  రాంచీ పిచ్ పై  కివీస్ బ్యాటర్లు  భారీ హిట్టింగ్ కు దిగారు. భారత స్పిన్నర్లు కాస్త అడ్డుకట్ట వేసి  కివీస్ మరీ భారీ స్కోరు సాధించకుండా అడ్డుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన  న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.  ఓపెనర్లు డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52, 7 ఫోర్లు,  1 సిక్స్), ఫిన్ అలెన్ (23 బంతుల్లో 35, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. చివర్లో డారిల్ మిచెల్ (30 బంతుల్లో 59 నాటౌట్, 3 ఫోర్లు, 5 సిక్సర్లు)  ధాటిగా ఆడాడు.  భారత  బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఆకట్టుకున్నారు. పేసర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన కివీస్  ఇన్నింగ్స్ ను ఓపెనర్ ఫిన్ అలెన్ (23 బంతుల్లో 35, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)   దూకుడుగా ఆరంభించాడు. హార్ధిక్ పాండ్యా వేసిన  తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన అతడు..  అర్ష్‌దీప్ బౌలింగ్ లో  మరో బౌండరీ బాదాడు. అతడే వేసిన  నాలుగో ఓవర్లో  ఓ భారీ సిక్సర్ తో పాటు ఫోర్ కొట్టాడు. 

పేసర్లు విఫలమవడంతో  హార్ధిక్.. బంతిని స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కు  ఇచ్చాడు. అతడు వేసిన  ఐదో ఓవర్ తొలి బంతికి  అలెన్ భారీ సిక్సర్ బాదాడు. కానీ  రెండో బంతికి   అలాగే ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్ కు చిక్కాడు.  అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  చాప్‌మన్ (0).. సుందర్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డాడు. నాలుగు బంతులు ఎదుర్కున్న  చాప్‌మన్..  ఆ ఓవర్లో చివరి బంతిని  ఆఫ్ సైడ్ పుష్ చేయబోయాడు.   బౌలింగ్ ఎండ్ లో ఉన్న  సుందర్.. ముందుకు డైవ్ చేస్తూ  స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.   

అయితే అలెన్ నిష్క్రమించినా కివీస్  స్కోరును కాన్వే ముందుకు నడిపించాడు.  ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్లో  కాన్వే.. రెండు ఫోర్లు,  ఓ సిక్సర్ బాదాడు. పది ఓవర్లకు కివీస్ స్కోరు 79-2గా ఉంది. దీపక్ హుడా వేసిన  12వ ఓవర్లో కాన్వే, ఫిలిప్స్ (17) లు చెరో ఫోర్ కొట్టారు.   కానీ ఈ జోడీనికి కుల్దీప్ విడదీశాడు. అతడు వేసిన  13వ ఓవర్లో  ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి  సూర్యకు క్యాచ్ ఇచ్చాడు. 

ఫిలిప్స్ స్థానంలో వచ్చిన  డారిల్ మిచెల్  కూడా ధాటిగానే ఆడాడు. శివమ్ మావి వేసిన 14వ ఓవ్లో రెండు  బౌండరీలు కొట్టాడు. మరోవైపు  సుందర్ వేసిన  16వ ఓవర్  ఐదో బంతికి  సింగిల్ రన్ తీసి  కాన్వే హాఫ్  సెంచరీ (31 బంతుల్లో) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

హార్ధిక్ వేసిన 17వ ఓవర్లో డారిల్ మిచెల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు.  కానీ  అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్  రెండో బంతికి భారీ షాట్ ఆడబోయిన  కాన్వేను హుడాకు క్యాచ్ ఇచ్చాడు.   అదే ఓవర్లో  బ్రాస్‌వెల్ (1) రనౌట్ అయ్యాడు.  శివమ్ మావి వేసిన 19వ ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (7)   రాహుల్ త్రిపాఠికి చిక్కాడు. మూడు ఓవర్ల పాటు కివీస్ బ్యాటర్లను భారీ  షాట్లు ఆడకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. కానీ చివరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ మళ్లీ దారుణంగా విఫలమయ్యాడు. అర్ష్‌దీప్ బౌలింగ్ లో మిచెల్ 6 (నో బాల్), 6, 6, 4, 0, 2, 2 బాదాడు. ఆ ఓవర్లో కివీస్ మొత్తంగా 27 పరుగులు పిండుకుంది. దీంతో ఆ జట్టు స్కోరు 170 దాటింది. 

Follow Us:
Download App:
  • android
  • ios