Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st T20I: టాస్ గెలిచిన రోహిత్ శర్మ... చాహాల్‌కి దక్కని చోటు...

India vs New Zealand 1st T20I: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ... కివీస్ కెప్టెన్‌గా టిమ్ సౌథీ...

INDvsNZ 1st T20I: Indian Captain Rohit Sharma won the toss and elected to field first
Author
India, First Published Nov 17, 2021, 6:55 PM IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కివీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది...టీమిండియా పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి మ్యాచ్ కానుంది. అలాగే భారత కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా నేటి మ్యాచ్ నుంచి అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయిన భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి తొలి టీ20 మ్యాచ్‌లో కూడా చోటు దక్కలేదు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి మరో అవకాశం ఇచ్చిన రోహిత్ శర్మ, అతనితో పాటు అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు కల్పించారు...

Read: నన్నే కాదు, ఛతేశ్వర్ పూజారాని కూడా అలా అవమానించారు... యార్క్‌షైర్ వివాదంలో అజీమ్ రఫీక్ సంచలన వ్యాఖ్యలు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అద్భుతంగా రాణించి, ‘ఆరెంజ్ క్యాప్’  గెలిచిన సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందని ఆశించినా, సీనియర్ ఓపెనర్లనే కొనసాగించేందుకు మొగ్గు చూపింది టీమిండియా. కెఎల్ రాహుల్‌తో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనున్నాడు...

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, టీ20 సిరీస్‌కి దూరంగా ఉండడంతో సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కెప్టెన్సీలో మొదటి టీ20 మ్యాచ్ ఆడనుంది న్యూజిలాండ్ జట్టు. మొదటి టీ20 తర్వాత తర్వాతి రెండు టీ20 మ్యాచులకు ఇద్దరు వేర్వురు కెప్టెన్లను ప్రకటించాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తున్నట్టు సమాచారం...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అదిరిపోయే ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్, నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. అతనితో పాటు సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, దీపిక్ చాహార్, మహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు.

గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి దూరమైన కివీస్ పేసర్ లూకీ ఫర్గూసన్ నేటి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్‌కి కూడా మార్చిలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కింది... 

Read: రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ... వారి విషయంలో టీమిండియాకి కలిసిరాని ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా...

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, నేడు 50వ టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. టీ20ల్లో 58 వికెట్లు తీసిన అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా (66 టీ20 వికెట్లు), చాహాల్ (63 టీ20 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. 

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గుప్టిల్, డార్ల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సిఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, టాడ్ అస్లే, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్...

భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, మహ్మద్ సిరాజ్

Follow Us:
Download App:
  • android
  • ios