Asianet News TeluguAsianet News Telugu

INDvsENG 4th Test: రోహిత్ శర్మ అవుట్, ఆ వెంటనే పూజారా... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారాలను అవుట్ చేసిన రాబిన్‌సన్... 127 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 61 పరుగులు చేసి పెవిలియన్ చేరిన పూజారా...

INDvsENG 4th Test: Team India lost Rohit Sharma and cheteshwar pujara after huge partnership
Author
India, First Published Sep 4, 2021, 9:26 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 256 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 127 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, క్రిస్ వోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఇంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్‌లో మూడు సార్లు ఫుల్‌ షాట్‌కి ప్రయత్నించి అవుటైన రోహిత్, ఈసారి కూడా అలానే అవుట్ కావడం విశేషం... కొత్త బంతిని తీసుకున్న తర్వాతి తొలి డెలివరీకే ఇంగ్లాండ్‌కి వికెట్ దక్కడం విశేషం.

రెండో వికెట్‌కి ఛతేశ్వర్ పూజారాతో కలిసి 278 బంతుల్లో 153 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత నాలుగో బంతికి ఛతేశ్వర్ పూజారా కూడా అవుటయ్యాడు. 127 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేసిన పూజారా, రాబిన్‌సన్ బౌలింగ్‌లో మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

237 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా. పూజారా అవుటయ్యే సమాయానికి ఇంగ్లాండ్‌‌పైన 138 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత జట్టు. ఒకే మ్యాచ్‌లో ఆరు రికార్డులు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ... 2021లో వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పూజారా, ఇంగ్లాండ్‌లో 2 వేల పరుగులను అందుకున్నాడు.

మూడు వేల టెస్టు పరుగులను పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ, 15 వేల అంతర్జాతీయ పరుగులతో పాటు మొట్టమొదటి ఓవర్‌సీస్ సెంచరీని అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...

Follow Us:
Download App:
  • android
  • ios