Asianet News TeluguAsianet News Telugu

INDvsENG: సెంచరీ ముంగిట ఛతేశ్వర్ పూజారా అవుట్... విరాట్ కోహ్లీ మళ్లీ అలాగే...

నాలుగో రోజు ఉదయమే రెండు వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా... సెంచరీ ముంగిట ఛతేశ్వర్ పూజారా, హాఫ్ సెంచరీ చేసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ అవుట్...

INDvsENG 3rd Test: Team India lost Pujara and Virat Kohli Wickets Early in fourth Day
Author
India, First Published Aug 28, 2021, 4:25 PM IST

మూడో టెస్టులో టీమిండియా నాలుగో రోజు ఉదయమే రెండు వరుస వికెట్లు కోల్పోయింది... ఓవర్‌నైట్ స్కోరు 215/2 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా, అదే స్కోరు వద్ద ఛతేశ్వర్ పూజారా వికెట్‌ కోల్పోయింది. 

189 బంతుల్లో 15 ఫోర్లతో 91 పరుగులు చేసిన పూజారా, 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు... ఛతేశ్వర్ పూజారా 90ల్లో అవుట్ కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 2017లో 92 పరుగులకి అవుట్ అయ్యాడు ఛతేశ్వర్ పూజారా.. 

విరాట్ కోహ్లీ బౌండరీతో టెస్టుల్లో 26వ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇంగ్లాండ్‌లో విరాట్‌కి ఇది ఆరో హాఫ్ సెంచరీ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్‌గా ధోనీ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ...

వరుసగా రెండు ఫోర్లు బాది జోరు మీదున్నట్టుగా కనిపించిన విరాట్ కోహ్లీ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో మరోసారి షాట్ ఆడబోయి జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...  237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. 

ఆ తర్వాత 24 బంతుల్లో 10 పరుగులు చేసిన అజింకా రహానే కూడా మళ్లీ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 239 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 115 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు... 
 

Follow Us:
Download App:
  • android
  • ios