మూడో వికెట్‌కి 77 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్...టీ విరామానికి 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు...హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్ సిబ్లీ...
మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు టీ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. మొదటి సెషన్ చివర్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు, రెండో సెషన్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. బౌలింగ్‌కి పిచ్ ఏ మాత్రం సహకరించకపోవడంతో జాగ్రత్తగా బ్యాటింగ్ కొనసాగించారు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.
2016లో జెన్నింగ్స్ తర్వాత చెన్నైలో హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక జట్టు ఓపెనర్‌గా నిలచాడు సిబ్లీ. 186 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసిన సిబ్లీ... జో రూట్‌తో కలిసి మూడో వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జో రూట్ 100 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు.
26వ ఓవర్‌లో రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్, ఆ తర్వాత 30 ఓవర్లు పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు రెండు సెషన్లు ముగిసేసరికే 8 నో బాల్స్ బౌలింగ్ చేయడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో తేలిగ్గా బౌండరీలు బాదిన జో రూట్... నదీమ్ బౌలింగ్‌లో కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు.
