Asianet News TeluguAsianet News Telugu

INDvsBAN 2nd Test: కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ అవుట్... రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా... మరోసారి నిరాశపరిచిన కెప్టెన్ కెఎల్ రాహుల్! రెండు వికెట్లు తీసిన తైజుల్ ఇస్లాం.. 

INDvsBAN 2nd Test: KL Rahul, Shubman Gill Disappoints, Taijul Islam picks two
Author
First Published Dec 23, 2022, 10:12 AM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు 19/0 ఓవర్‌నైట్ స్కోరుతో  రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... ఓపెనర్లు ఇద్దరినీ త్వరగా కోల్పోయింది. 45 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..

ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు తైజుల్ ఇస్లాం. 39 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

22 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది టీమిండియా. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌, తొలి ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 227 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు.. 

రెండో ఓవర్ తొలి బంతికి జాకీర్ హసన్ ఇచ్చిన క్యాచ్‌ని మహ్మద్ సిరాజ్ జారవిడిచాడు. సున్నా వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్ హసన్,, జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

2010లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్,  4380 రోజుల తర్వాత తొలి టెస్టు వికెట్ పడగొట్టాడు. జాకీర్ హసన్ అవుటైన తర్వాత మూడో బంతికే నజ్ముల్ హుస్సేన్ షాంటో కూడా పెవిలియన్ చేరాడు. 57 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

షాంటో డీఆర్‌ఎస్ తీసుకున్నా, టీవీ రిప్లైలో అంపైర్ కాల్స్‌గా తేలడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు బంగ్లా ఓపెనర్. వస్తూనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్...

39 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీం, నాలుగో వికెట్‌కి మోమినుల్ హక్‌తో కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ముస్తాఫికర్ రహీం. లిటన్ దాస్, మోమినుల్ హక్ కలిసి ఐదో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జత చేశారు...

26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన లిటన్ దాస్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... మెహిదీ హసన్ మిరాజ్ 15 పరుగులు చేసి అవుట్ కాగా నురుల్ హసన్ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వెంటవెంట ఓవర్లలో ఈ రెండు వికెట్లు కూడా ఉమేశ్ యాదవ్‌కే పడ్డాయి...

ఓ ఎండ్‌లో వికెట్ పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన మోమినుల్ హక్, భారత ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు... జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది 78 బంతుల్లో 10 బౌండరీలతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు మోమినుల్ హక్. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మోమినుల్ హక్, సింగిల్ డిజిట్ స్కోరు దాటడం ఇదే మొదటిసారి..  

157 బంతులు ఆడి 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 84 పరుగులు చేసిన మోమినుల్ హక్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే ఖలీద్ అహ్మద్‌ని అవుట్ చేసిన అశ్విన్, బంగ్లా ఇన్నింగ్స్‌కి తెర దించాడు. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్టు ఆడుతున్న జయ్‌దేవ్ ఉనద్కట్‌కి రెండు వికెట్లు దక్కాయి... 

Follow Us:
Download App:
  • android
  • ios