Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS 1st Test: టాస్ గెలిచిన టీమిండియా... సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం...

India vs Australia 1st test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ ఆరంగ్రేటం... 

INDvsAUS 1st Test: australia won the toss and elected to bat first, Suryakumar yadav cra
Author
First Published Feb 9, 2023, 9:09 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఈ సిరీస్ గెలవడం చాలా అవసరం..

నేటి మ్యాచ్ ద్వారా సూర్యకుమార్ యాదవ్‌తో పాటు తెలుగు వికెట్ కీపింగ్ బ్యాటర్ కెఎస్ భరత్, టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నారు. సూర్యకి ఇది టెస్టుల్లో మొదటి మ్యాచ్ కాగా కోన శ్రీకర్ భరత్‌కి మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్.. 

శుబ్‌మన్ గిల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తారని ప్రచారం జరిగినా టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం కల్పించింది టీమిండియా. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ బాది, టీ20ల్లో సెంచరీ నమోదు చేసి బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు... 2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్య, రెండేళ్ల తర్వాత టెస్టుల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. టెస్టు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి రెస్ట్ ఇచ్చినప్పటి నుంచి టెస్టు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాడు కె.ఎస్ భరత్...

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకి దూరం కావడంతో భరత్‌కి ఎట్టకేలకు తుదిజట్టులో ఆడే అవకాశం దక్కింది. 

ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా, మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాని కనీసం 2-0 తేడాతో ఓడిస్తే... ఆసీస్‌ని వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌ని చేరుకుంటుంది.

ఆస్ట్రేలియా ద్వారా స్పిన్నర్ టాడ్ ముర్ఫీ నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. స్నిన్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతోంది భారత జట్టు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లకు తుది జట్టులో చోటు కల్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్, కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టేసింది... 

భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మహ్మద్ షమీ వరకూ 10 మంది ప్లేయర్లు బ్యాటింగ్ చేయగలరు. మహ్మద్ సిరాజ్ కూడా ఆడపా దడపా షాట్లు ఆడగలడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఫోకస్ పెట్టిన టీమిండియా, ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యం ఇచ్చింది. 

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాట్ రెంశా, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ, స్కాట్ బోలాండ్

భారత జట్టు:  రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా,రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

 

Follow Us:
Download App:
  • android
  • ios