Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ కు క్రికెట్ ఫీవర్... మైదానంలో భారత ఆటగాళ్ళ సందడి (వీడియోలు)

ఇప్పటికే స్వదేశంలో జరిగిన టీ20 సీరిస్ కోల్పోయిన టీమిండియా టెస్ట్ సీరిస్ పై  కన్నేసింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ సీరిస్ ను గెలవాలన్న పట్టుదలతో వున్న కోహ్లీసేన వైజాగ్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.  

Indian Team Practice In Vizag Ahead Of  first test
Author
Vishakhapatnam, First Published Sep 30, 2019, 3:46 PM IST

చాలాకాలం తర్వాత విశాఖపట్నంలో క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. టీమిండియా- సౌతాఫ్రికాల మధ్య అక్టోబర్ 2వ తేదీ నుండి మొదటి టెస్ట్ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే ఇరు దేశాల ఆటగాళ్లు విశాఖకు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. దీంతో తమ అభిమాన ఆటగాళ్లను కళ్ళారా చూసేందుకు వైజాగ్ క్రికెట్ ప్రియులు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, ఆటగాళ్ళు బసచేసిన హోటల్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

అయితే ఇప్పటికే స్వదేశంలో జరిగిన టీ20 సీరిస్ దక్కించుకోలేకపోయిన కోహ్లీసేన టెస్ట్ సీరిస్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో భారత ఆటగాళ్లు ఆదివారం విశాఖలో అడుగుపెట్టగా మరుసటి రోజే అంటే సోమవారం నుండే సాధన మొదలెట్టేశారు. ముఖ్యంగా చీఫ్ కోచ్ రవిశాస్త్రి దగ్గరుండి మరీ ఆటగాళ్లతో సాధన చేయిస్తున్న వీడియోనే తాజాగా బిసిసిఐ అభిమానులతో పంచుకుంది. 

సౌతాఫ్రికాతో టెస్ట్ సీరిస్ నుండి కీలక బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడు లేనిలోటును భర్తిచేయాలంటే జట్టులో వున్న మిగతా ఫేసర్లు రాణించాల్సివుంటుంది. కాబట్టి సీనియర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలతో చీఫ్ కోచ్ తెగ బౌలింగ్ సాధన చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనే బిసిసిఐ అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. 

అలాగే టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ కోహ్లీకి కూడా ఈ టెస్ట్ సీరిస్ చాలా కీలకంగా మారింది. యాషెస్ సీరిస్ లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా ఆసిస్ ఆటగాడు స్టీవ్  స్మిత్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కినెట్టి మొదటి ర్యాంకును అందుకున్నాడు. దీంతో ఎలాగయినా తన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోవాలనుకుంటున్న కోహ్లీకి ఈ సీరిస్ ఉపయోగడనుంది. అంతేకాకుండా టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో  భాగంగా ఈ మ్యాచ్ జరుగుతోంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో వైజాగ్ టెస్ట్ గెలవాలని కోహ్లీ పట్టుదలతో వున్నట్లు అర్థమవుతోంది. 

ఈ నేపసథ్యంలో అతడు సోమవారం తెగ నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కోహ్లీ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నవీడియోను కూడా బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలా భారత ఆటగాళ్లు వైజాగ్ స్టేడియంలో తెగ సందడి చేస్తున్నారు. సఫారీ ఆటగాళ్ళు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 

వీడియోలు

 

Follow Us:
Download App:
  • android
  • ios