Asianet News TeluguAsianet News Telugu

పాక్ క్రికెటర్లతో... ఇండియన్ ట్యాక్సీ డ్రైవర్ విందు

క్రికెటర్లు షాహిన్ షా అఫ్రీది , యాసిర్ షా, నసీమీ్ షాలతోపాటు మరో ఇద్దరు ఆ డ్రైవర్ ను తమ వెంట రెస్టారెంట్ కి తీసుకువెళ్లి విందు ఇచ్చారు. ఏబీసీ రేడియో వ్యాఖ్యత అలిసన్ మిచెల్ ఈ విషయాన్ని ఆసిస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కు లైవ్ లో తెలియజేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
 

Indian taxi driver refuses to take money, treated to dinner by Pakistan cricketers
Author
Hyderabad, First Published Nov 26, 2019, 11:33 AM IST

ఇండియన్ ట్యాక్సీ డ్రైవర్ కి ఆస్ట్రేలియాలో పాక్ క్రికెటర్లు విందు భోజనం అందించారు. వాళ్లతో కలిసి ఆ క్యాబ్ డ్రైవర్ ని తీసుకువెళ్లి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో చోటుచేసుకుంది. 

ఇంతకీ మ్యాటరేంటంటే.... పాక్ క్రికెటర్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. టెస్టు మ్యాచ్ కోసం వెళ్లారు. బ్రిస్బేన్ లో జరిగిన  తొలి టెస్టులో పాక్ ఓటమిపాలయ్యింది. ఇదిలా ఉండగా.... బ్రిస్బేన్ హోటల్ నుంచి ఐదుగురు పాక్ క్రికెటర్లు ఓ క్యాబ్ బుక్ చేసుకొని ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లారు. కాగా... క్రికెటర్లనే గౌరవంతో.. ఆ క్యాబ్ డ్రైవర్ వారి వద్ద నుంచి డబ్బు తీసుకోలేదు.

దీంతో ఆ క్రికెటర్లు షాహిన్ షా అఫ్రీది , యాసిర్ షా, నసీమీ్ షాలతోపాటు మరో ఇద్దరు ఆ డ్రైవర్ ను తమ వెంట రెస్టారెంట్ కి తీసుకువెళ్లి విందు ఇచ్చారు. ఏబీసీ రేడియో వ్యాఖ్యత అలిసన్ మిచెల్ ఈ విషయాన్ని ఆసిస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కు లైవ్ లో తెలియజేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అలిసన్ మిచెల్ కి ఈ విషయాన్ని స్వయంగా క్యాబ్ డ్రైవర్ చెప్పడం విశేషం. ఆమె కూడా అదే క్యాబ్ లో ఆసీస్-పాక్ టెస్టు మ్యాచ్ చూడటానికి స్టేడియంకి వస్తుండగా.. ఈ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ చెప్పడం విశేషం. ఆ డ్రైవర్ ఇండియన్ కాగా... ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios