ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచులు టెస్టు సిరీస్ అనంతరం, ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. టీ20 సిరీస్‌కు 19 మంది ప్లేయర్లతో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ముందుగా అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2020 సీజన్‌లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తిలకు టీ20 జట్టులో అవకాశం దక్కింది.

వీరితోపాటు గాయం నుంచి కోలుకున్న భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌, టీ20 ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇవ్వగా మనీశ్ పాండే, సంజూ శాంసన్‌లకు అవకాశం దక్కలేదు.

 

టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇది:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహఆర్, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.