టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ మున్సిపల్ అధికారులు ఫైన్ విధించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని వృధా చేస్తున్నారని అతడిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న అధికారులు కోహ్లీకి రూ.500 జరిమానా విధించారు. ఈ చలానాను అతడి ఇంటికి పంపించినట్లు ఓ మున్సిపల్ అధికారి తెలిపారు.

విరాట్ కోహ్లీ బాలివుడ్ భామ అనుష్క శర్మ  ను పెళ్లిచేసుకుని ముంబైలో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే స్వతహాగా డిల్లీకి చెందిన కోహ్లీకి గురుగ్రావ్ లో కూడా ఓ ఇళ్లు వుంది. అయితే ఆ ఇంట్లో కార్లను శుభ్రం చేయడానికి మున్సిపాలిటీ సప్లయ్ చేసే నీటిని ఇష్టం వచ్చినట్లు వాడుతునట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ నీరంతా రోడ్డుపై పారుతూ ఆ ఇంటి చుట్టుపక్కల వుండే వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తోంది. 

దీంతో వారంతా కలిసి గురుగ్రావ్ నగర్ నిగమ్ అధికారులకు దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ ఇంటి యజమాని కోహ్లీకి రూ.500 ఫైన్ విధిస్తూ చర్యలు తీసుకున్నారు. నీటి వృధాను అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ ఇంజినీర్ అమన్ ఫొగట్ పేర్కొన్నారు. కోహ్లీతో పాటు మరో పదిమందికి కూడా చలాన్లు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.