ఇషాంత్ శర్మ సైతం  జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. జట్టు మొత్తం కష్టపడిందని.. అందుకే విజయం దక్కిందన్నారు.


లార్డ్స్ లో ఇండియన్ క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. 151 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా.. ఈ విజయం పట్ల ఇండియన్ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారు ఎంత ఎమోషనల్ అయ్యారు అనే విషయం వారి ట్వీట్స్ చూస్తేనే అర్థమౌతుంది. మొత్తం ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో భారత్ ఆదిక్యం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆఖరి రోజు ఐదో రోజు టీమిండియా అద్భుత ప్రదర్శన కనపరిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. ఇషాంత్ శర్మ సైతం జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. జట్టు మొత్తం కష్టపడిందని.. అందుకే విజయం దక్కిందన్నారు.

Scroll to load tweet…

గేమ్ అంటే ఇది అని.. చాలా నిబద్ధత, ఆటిట్యూడ్ తో విజయం సాధించామనంటూ కోహ్లీ ట్వీట్ చేశారు. ఇక రోహిత్ శర్మ వీడియో కూడా షేర్ చేశాడు. లార్డ్స్ విజయంయ చాలా ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఇది కంప్లీట్ గా టీమ్ ఘనత గా పేర్కొన్నాడు. ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు అని పేర్కొన్నాడు.

Scroll to load tweet…

రిషబ్ పంత్ ట్వీట్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా ఆకలితో ఉన్నామని.. దానిని ఇలా చూపించామంటూ పంత్ పేర్కొన్నాడు. మంచి విజయంతో లార్డ్స్ నుంచి తిరిగి వస్తున్నామని.. దీనిని ఎప్పటికీ మర్చిపోలేమని పంత్ పేర్కొన్నాడు. 

Scroll to load tweet…