Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన అభిమన్యు మిథున్... ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, ముంబై, సన్‌రైజర్స్‌కి!

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, వైట్ బాల్ క్రికెట్‌లో కొనసాగుతానంటూ ప్రకటించిన బెంగళూరు ఫాస్ట్ బౌలర్... ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన 10 వారాలకే టీమిండియాలోకి ఎంట్రీ...

Indian Pacer Abhimanyu Mithun announced retirement to first class cricket
Author
India, First Published Oct 8, 2021, 5:56 PM IST

భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల అభిమన్యు మిథున్, భారత జట్టు తరుపున 4 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఫస్ట్ క్లాస్‌లో ఆరంగ్రేటం చేసిన 10 వారాలకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు అభిమన్యు మిథున్...

దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన అభిమన్యు మిథున్, భారత జట్టు తరుపున ఆడిన 4 టెస్టుల్లో 9 వికెట్లు పడగొట్టాడు. 5 వన్డేల్లో 3 వికెట్లు తీశాడు.. దేశవాళీ క్రికెట్‌లో మంచి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిథున్‌, భారత జట్టులో తనకి వచ్చిన అవకాశాలను మాత్రం సరిగా వినియోగించుకోలేకపోయాడు...


ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ, వైట్ బాల్ క్రికెట్‌లో కొనసాగుతానని కామెంట్ చేశాడు అభిమన్యు మిథున్...  ‘దేశానికి ఆడే అవకాశం దక్కడమే నా కెరీర్‌లో పెద్ద అఛీవ్‌మెంట్. నా కెరీర్ మొత్తం ఎంతో ఎంజాయ్ చేశా... క్రికెట్‌ ఓ యూనివర్సల్ గేమ్. నాకు మరిన్ని అవకాశాలు కల్పించుకోవడం కోసమే ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు మిథున్..

103 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అభిమన్యు మిథున్, తన కెరీర్‌లో 26.63 సగటుతో 338 వికెట్లు తీశాడు. తన పుట్టినరోజున హ్యాట్రిక్ తీసిన మిథున్, 96 లిస్టు ఏ మ్యాచులు, 74 టీ20 మ్యాచులు ఆడి రెండు ఫార్మాట్లలో కలిపి 205 వికెట్లు తీశాడు...

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన అభిమన్యు మిథున్, ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. మొత్తంగా తన కెరీర్‌లో 16 ఐపీఎల్ మ్యాచులు ఆడిన మిథున్, ఏడు వికెట్లు తీశాడు...

Follow Us:
Download App:
  • android
  • ios