భారత మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వయసు కారణంగా తీవ్ర అలసట, మాట సరిగా రాకపోవడంతో చంద్రశేఖర్‌ను ఆసుపత్రికి తరలించినట్టు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

75 ఏళ్ల చంద్రశేఖర్...  భారత జట్టు తరుపున 58 టెస్టు మ్యాచులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. 16 సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టిన చంద్రశేఖర్, బెస్ట్ పర్ఫామెన్స్ 8/79. 21 జనవరి, 1964లో ఇంగ్లాండ్‌పై క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన చంద్రశేఖర్, 15 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగారు. 

1976లో న్యూజిలాండ్‌పై ఏకైక వన్డే ఆడిన చంద్రశేఖర్, మూడు వికెట్లు పడగొట్టారు. 1971లో ఇంగ్లాండ్‌పై ఓవల్‌ స్టేడియంలో 38 పరుగులకే 6 వికెట్లు తీసిన చంద్రశేఖర్, 2002లో ‘విజ్డెన్ బెస్ట్ బౌలింగ్ పర్ఫామెన్స్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డు గెలిచారు.