భారత మాజీ క్రికెటర్, కోచ రవిశాస్త్రి వయసు 120 ఏళ్లంటూ వికీ పీడియాలో నమోదు...27 మే 1900న రవిశాస్త్రి జన్మించినట్టుగా ఎడిట్ చేసిన ఆకతాయిలు...కొన్నాళ్ల కిందట 28 ఏళ్ల దీపక్ చాహార్‌ను 48 ఏళ్ల క్రికెటర్‌గా చూపించిన వికీ పీడియా...
భారత హెడ్ కోచ్ రవిశాస్త్రికి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. భారత జట్టు ఘోరమైన ప్రదర్శన చూపించినప్పుడల్లా ఆ ఎఫెక్ట్ కోచ్ రవిశాస్త్రిపైనే ఎక్కువగా పడుతుంది. భారత జట్టు విజయాల్లో మాత్రం కోచ్ రవిశాస్త్రికి క్రెడిట్ దక్కే సందర్భాలు చాలా తక్కువ. ఇదిలా ఉంచితే తాజాగా అప్పుడప్పుడూ సిల్లీ తప్పులు చేసే గూగుల్ తల్లి, మాజీ క్రికెటర్, భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి వయసు 120 ఏళ్లు అంటూ చూపిస్తోంది.
27 మే 1900న జన్మించిన రవిశాస్త్రి వయసు 120 ఏళ్లంటూ వికీ పీడియాలో కూడా వయసు తప్పుగా నమోదైంది. కొన్నాళ్ల కిందట 28 ఏళ్ల దీపక్ చాహార్‌ను 48 ఏళ్ల క్రికెటర్‌గా చూపించిన వికీ పీడియా... ఇప్పుడు 1962లో జన్మించిన రవిశాస్త్రి వయసు 58 ఏళ్లకి బదులుగా 120 ఏళ్లుగా చూపిస్తోంది.
మహా తాగుబోతుగా కీర్తిగడించిన రవిశాస్త్రి కంటే గూగుల్ పెద్ద తాగుబోతులా ఉందే... అంటూ ఫన్నీ మీమీలు, ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం ఇవ్వలేదనే కారణంగా హెడ్ కోచ్ వయసును ఇలా ఎడిట్ చేసి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు.
