ఈ ఏడాది ఆరంభంలో భారత క్రికెట్ జట్టు ఒక బ్రహ్మాండమైన సిరీస్ విజయంతో ఆరంభించింది. ఆస్ట్రేలియా సొంతగడ్డపైనే ఆ దేశాన్ని మట్టికరిపించింది. గత సంవత్సర ఆఖరులో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించి తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది కోహ్లీ సేన. 

2019 జనవరి నెలలో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి ఆసీస్‌పై ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తొలి వన్డేలో ఆసీస్‌ గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేల్లో టీమిండియానే విజయం నమోదు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కోహ్లి, ధోనిలు వెన్నుదన్నుగా నిలవడంతో భారత్‌ సిరీస్‌ను సునాయాసంగా చేజిక్కించుకుంది. ఇంత విజయవంతమైన సిరీస్ ను ఒకసారి నెమరువేసుకుందాం. ఈ సిరీస్ విజయం తో భారత్ తన జాయాత్రయాత్రను ప్రారంభించింది. 

ధోని...వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే... 

టీమిండియా ఈ సిరీస్ లో తొలి వన్డేలో ఆసీస్‌ విజయం సాధించినప్పటికీ, భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాత్రం ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరపున అంతర్జాతీయ వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని ధోని చేరాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా ధోని అవతరించాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ధోని ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 9,999 పరుగుల వద్ద ఉన్న ధోని, ఆ లాంఛనం పూర్తి చేయడానికి అవసరసమైన ఆ ఒక్క పరుగు సాధించడంతో టీమిండియా తరఫున పదివేల పరుగుల మార్క్ చేరుకున్నాడు.

ఈ సిరీస్ లో ధోని మరో రికార్డును కూడా నెలకొల్పి ఇండియాకు రికార్డు విజయాన్ని అందించాడు. ఈ సిరీస్ లో ధోని మూడు మ్యాచుల్లోనూ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.   తొలి వన్డేలో 51 పరుగులు సాధించాడు. రెండో వన్డేలో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో ఇతోధిక కృషి చేసాడు. మెల్‌బోర్న్‌ లో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని 87 పరుగులు సాధించి టీం ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. 

హిట్ మ్యాన్ సెంచరీల షో...

ఆసీస్‌తో సిరీస్‌ తొలి  వన్డే తోనే టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా ఒక మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే  శతకాలు సాధించిన రెండో బ్యాట్స్ మెన్ గా రోహిత్‌ శర్మ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచులో సాధించిన శతకం, ఆసీస్‌పై వన్డేల్లో రోహిత్‌కు 7వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 22వ వన్డే సెంచరీ. ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 9 సెంచరీలతో సచిన్‌ టెండూల‍్కర్‌ తొలి స్థానంలో  ఉన్నాడు. 

"3డి" విజయ్‌ శంకర్ వన్డే అరేంగేట్రం.. 

చహల్‌ కొత్త రికార్డు : ఈ సిరీస్‌ ద్వారా భారత్‌ ఆల్‌ రౌండర్‌ విజయ శంకర్‌ తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ ఆడాడు.  ఈ చివరి మ్యాచులో విజయ్ శంకర్ అరంగేట్రం చేశాడు. అల్ఈ రౌండర్ కోటాలోటీంలోకి వచ్చినప్పటికీ... ఈ మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో కూడా ఆరు ఓవర్లు బౌలింగ్‌ చేసి 23 పరుగులు ఇచ్చాడు. 

చాహల్ అల్ టైం రికార్డు... 

భారత్‌  స్పిన్నర్‌ చాహల్‌ ఆరు  వికెట్లు సాధించి రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 6 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అప్పటివరకూ టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పేరిట రికార్డు ఉండేది. దాన్ని చాహల్ బద్దలు కొట్టాడు. రవి శాస్త్రి ఐదు వికెట్ల రికార్డును చహల్‌ చెరిపేసాడు. 

పాండ్యా, రాహుల్‌లపై వేటు

హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ లు కాఫీ విత్ కరణ్ షోలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలతో సర్వత్రా విమర్శలు  వెల్లువెత్తడంతో ఈ ఆటగాళ్లపై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు వేసింది.  దాంతో ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఈ ఇద్దరు క్రికెటర్లు దూరమయ్యారు.