ఇంగ్లాండ్ వేదికగా మరికొద్దిరోజుల్లో జరిగే ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ జట్లన్ని ప్రత్యేకంగా సిద్దమవుతున్నాయి.  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,  సౌతాఫ్రికా వంటి జట్లు ఐపిఎల్ మధ్యలో నుండే తమ ఆటగాళ్లను స్వదేశానికి రప్పించుకున్నారు. ప్రపంచ కప్ లో పాల్గొనే ఆటగాళ్లతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ వారిని మెగా టోర్నీ కోసం సంసిద్దం చేస్తున్నాయి. ఇలా అన్ని జట్లు  ప్రాక్టీస్ లో మునిగితేలుతుంటే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత జట్టు మాత్రం ఇప్పటివరకు ప్రాక్టీస్ ను ప్రారంభించలేదు. బిసిసిఐ ప్రత్యేకంగా ఆటగాళ్లను సంసిద్దం చేయడం మాట అటుంచితే వ్యక్తిగతంగా కూడా క్రికెటర్లు ప్రాక్టీస్ కు దూరంగా వుంటున్నారు. 

ఐపిఎల్ ముగిసిన వెంటనే చాలామంది టీమిండియా ప్లేయర్స్ ఫ్యామిలీతో సరదాగా గడపడానికే సమయాన్ని కెటాయిస్తున్నారు. మరికొందరు తమ కుటుంబాలతో కలిసి విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇలా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాగ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే వైస్ కెప్టెన్ రోహిత్ భార్యచ కూతురితో కలిసి మాలి దీవుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సముద్ర అందాలను వీక్షిస్తూ కుటుంబంతో కలిసును ఫోటోలను కూడా అతడు సోషల్ మీడియా మాద్యమాల ద్వారా అభిమానులతో  పంచుకున్నాడు.  

ఇక టీమిండియా యువ బౌలర్ యజువేందర్ చాహల్  ఐపిఎల్ తర్వాత గోవా బాట పట్టాడు. స్నేహితులతో కలిసి అక్కడి బీచుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఐపిఎల్ తర్వాత ఇదేవిధంగా ఎంజాయ్ చేయడానికే సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రపంచ కప్ కు ముందు ఇలా ఆటగాళ్లు ప్రాక్టీస్ ను వీడి  కేవలం సరదాకోసమే కేటాయించడంతో కొందరు మాజీల నుండి విమర్శలు వస్తున్నాయి. అటగాళ్లకు దేశ ప్రయోజనాల కంటే వ్యక్తగత సుఖమే ముఖ్యమైనట్లుందని అభిమానులు  కూడా ఆటగాళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే భారత ఆటగాళ్లంతా బిసిసిఐ అనుమతితోనే ప్రాక్టీస్ కు దూరంగా వున్నట్లు తెలుస్తోంది. విరామం లేకుండా  ఐపిఎల్ మ్యాచుల్లో పాల్గొనడం మూలంగా  ఆటగాళ్లు బాగా అలసిపోయారు.  మళ్లీ ప్రపంచ కప్ లో కూడా విరామం లేకుండా వరుసగా ఆడాల్సి వుంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో దొరికు ఖాళీ సమయంలో కుటుంబాలతో సరదాగా గడపండంటూ  బిసిసిఐ ప్రపంచకప్  ఆడే  ఆటగాళ్లకు సూచించినట్లు సమాచారం.  అందువల్లే ఆటగాళ్లు  మరికొద్దిరోజుల్లోనే వరల్డ్ కప్ వున్న ప్రాక్టీస్ కు దూరంగా వుంటున్నట్లు తెలుస్తోంది.