పెటర్నిటీ లీవ్ ద్వారా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చేసిన భారత సారథి విరాట్ కోహ్లీ... తిరిగి క్రికెట్ మోడ్‌లోకి వచ్చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం చెన్నైలోని హోటెల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు విరాట్ కోహ్లీ...

హోటెల్‌లో క్వారంటైన్‌లో ఎక్సర్‌సైజులు చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు విరాట్. పంజాబీ పాటలు వింటూ ఫుల్లుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు విరాట్. ‘ఫోబిక్ మ్యూజిక్, జిమ్ ఎక్విప్‌మెంట్... క్వారంటైన్ రోజుల్లో మీకు అవసరమైనవి ఇవే. కావాలంటే ఎక్కడైనా మీరు పని చేసుకోవచ్చు... అందరికీ రోజు బాగుండాలని కోరుకుంటున్నా’ అంటూ కాప్షన్ పెట్టాడు కోహ్లీ..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 

మొదటి రెండు టెస్టులకు ఎంపికైన రహానే, రోహిత్, సిరాజ్, పంత్ అండ్ కో అందరూ చెన్నై చేరుకుని, క్వారంటైన్‌లో గడుతుపున్న విషయం తెలిసిందే. జనవరి 11న విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.