Asianet News TeluguAsianet News Telugu

కూతురు పుట్టాక ట్విట్టర్ బయో మార్చేసిన విరాట్ కోహ్లీ... ఇంతకుముందు అలా, ఇప్పుడు ఇలా....

అధికారిక ట్విట్టర్ ఖాతాలో బయో మార్చిన విరాట్ కోహ్లీ...

జనవరి 11న ఆడ బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ...

భార్య, కూతురిపై ప్రేమకు గుర్తుగా విరాట్ కోహ్లీ బయో...

Indian Captain Virat Kohli changed Twitter Bio after birth of daughter CRA
Author
India, First Published Jan 19, 2021, 7:12 AM IST

భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆసియాలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగి ఉన్న సెలబ్రిటీ విరాట్ కోహ్లీయే. పెటర్నిటీ లీవ్ మీద ఆస్ట్రేలియా చివరి మూడు టెస్టులకి దూరమైన విరాట్ కోహ్లీ, జనవరి 11న తండ్రి అయ్యాడు.

కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతా బయోని మార్చేశాడు. ఇంతకుముందు ట్విట్టర్‌లో కోహ్లీకి... ‘ది అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ విరాట్ కోహ్లీ, ఇండియన్ క్రికెటర్, గేమర్, కార్ లవర్, లవ్స్ సాకర్ అండ్ అన్ ఎంతూజియాస్టిస్ట్గ’ అని బయోలో ఉండేది.

ఇప్పుడు దాన్ని ‘ఏ ప్రౌడ్ హస్బెండ్ అండ్ ఫాదర్’ అంటూ చివర్లో లవ్ సింబల్ జోడించాడు. భారత జట్టు కెప్టెన్‌గా కంటే తండ్రిగా, భర్తగా గర్విస్తున్నానంటూ కోహ్లీ మార్చిన బయో, క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుస్తోంది.

kohli, virat kohli విరాట్ కోహ్లీ ట్విట్టర్ ఖాతా

https://twitter.com/imVkohli

Follow Us:
Download App:
  • android
  • ios