Asianet News TeluguAsianet News Telugu

IND vs AUS T20I: ఆట ఆరంభం.. కానీ 8 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన టీమిండియా.. బుమ్రా ఎంట్రీ

IND vs AUS T20I Live: గత రెండ్రోజులుగా కురిసిన వర్షంతో నాగ్‌పూర్ స్టేడియం ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. పలుమార్లు అంపైర్లు గ్రౌండ్ ను పరిశీలించి ఎట్టకేలకు ఆటను కొనసాగించడానికే  నిర్ణయించారు. 

India Won The Toss and Elected To Field First against Australia in Nagpur T20I
Author
First Published Sep 23, 2022, 9:21 PM IST

నాగ్‌పూర్‌లో మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అని రెండున్నర గంటలుగా కండ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైన ఈ మ్యాచ్ అసలు జరిగేది అనుమానంగానే ఉన్నా పలుమార్లు గ్రౌండ్ ను పరిశీలించిన అంపైర్లు.. పరిస్థితులు అనుకూలించడంతో ఆటను కొనసాగించడానికే నిర్ణయించారు. రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. 

8 ఓవర్లకు కుదించడంతో ఈ మ్యాచ్ లో రెండు ఓవర్ల పవర్ ప్లే ఉండనుంది. ఒక్క బౌలర్  కనీసం రెండు ఓవర్లు వేసే అవకాశముందని అంపైర్లు నితిన్ మీనన్, అనంత పద్మనాభన్ తెలిపారు. ఈ మ్యాచ్ లో ఓవర్లు నెమ్మదిగా విసిరితే  పెనాల్టీ వేసే నిబంధన లేదు. 

మ్యాచ్ స్వరూపం ఇలా : 

- తొలి ఇన్నింగ్స్ : రాత్రి 9:30 గంటల నుంచి 10:04 గంటల వరకు 
- విరామం : 10:04 నుంచి  10:14 వరకు 
- రెండో ఇన్నింగ్స్ : 10:14 నుంచి 10:48 వరకు  
- డ్రింక్స్ బ్రేక్ లేదు. 

గత మ్యాచ్ లో ఆడకపోయిన బుమ్రా నాగ్‌పూర్ లో ఆడుతుండటం భారత్ కు గొప్ప ఊరట. అయితే ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ తర్వాత  దాదాపు నెలన్నర అనంతరం అతడు ఇప్పుడే గ్రౌండ్ లోకి దిగుతుండటం ఇదే ప్రథమం. మరి బుమ్రా ఏ మేరకు రాణిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్ లో ఆడిన ఉమేశ్ ను పక్కనబెట్టి టీమిండియా బుమ్రాను ఆడిస్తున్నది. అంతేగాక పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్న భువనేశ్వర్ ను పక్కనబెట్టి పంత్ ను ఆడిస్తున్నది. ఇక ఆస్ట్రేలియాలో ఎల్లిస్ స్థానంలో  డేనియల్ సామ్స్, ఇంగ్లిస్ స్థానంలో సీన్ అబాట్ ఆడుతున్నాడు. 

 

మొహాలీలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 208 పరుగుల భారీ స్కోరు చేసినా బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఓటమిపాలైంది. బుమ్రా లేని లోటు ఆ మ్యాచ్ లో స్పష్టంగా తెలిసింది.  మరి నేటి మ్యాచ్ లో బుమ్రా ఆడుతుండటంతో అతడే బౌలింగ్ దళానికి సారథ్యం వహించనున్నాడు.  బుమ్రా సారథ్యంలో బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనేది చూడాలి.  

తుది జట్లు :  

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ,  సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా 

ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామోరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, డేనియల్ సామ్స్, ఆడమ్ జంపా, జోష్ హెజిల్వుడ్ 

Follow Us:
Download App:
  • android
  • ios