చెన్నై: చెన్నైలోని చేపాక్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో వెస్టిండీస్ ఆటగాడు షిమ్రోన్ హెట్ మెయిర్ రికార్డు సాధించాడు. వెస్టిండీస్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్సుల్లో ఐదు వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

టీమిండియాతో తొలి వన్డేలో హెట్ మెయిర్ సెంచరీ సాధించాడదు. ఇది హెట్ మెయిర్ కు వన్డేల్లో ఐదో సెంచరీ. ఇది అతనికి 38వ ఇన్నింగ్స్. దాంతో అరుదైన రికార్డును హెట్ మెయిర్ తన పేరున నమోదు చేసుకున్నాడు.

Also Read: రవీంద్ర జడేజా ఔట్ ఎఫెక్ట్: అంపైర్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం

వెస్టిండీస్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్సుల్లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాళ్లలో అతను అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో షాయ్ హోప్ (46 ఇన్నింగ్సు), గ్రీనిడ్జ్ (52 ఇన్నింగ్సు), రిచర్డ్ (54 ఇన్నింగ్సు), క్రిస్ గేల్ (66 ఇన్నింగ్స్), డేస్మండ్ హేన్స్ (69 ఇన్నింగ్స్), బ్రియాన్ లారా (83 ఇన్నింగ్సు) ఉన్నారు. 

ఇండియాపై మ్యాచులో హెట్ మెయిర్ 85 బంతుల్లో సెంచరీ సాధించాడు. హెట్ మెయిర్ 139 పరుగులు చేసి ఎట్టకేలకు అవుటయ్యాడు. ఆ తర్వాత హోప్ కూడా సెంచరీ సాధించాడు.

Also Read: రిషబ్ పంత్ మారడు: అదే షాట్, అదే ఔట్