Asianet News TeluguAsianet News Telugu

వన్డే సీరిస్ క్లీన్ స్వీప్: కోహ్లీ సూపర్ సెంచరీ...వెస్టిండిస్ పై భారత్ ఘన విజయం

భారత్-వెస్టిండిస్ ల మధ్య జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి విండీస్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన 32 ఓవర్లలోనే  ఛేదించింది. రెండో వన్డేలో మాదిరిగానే కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లోనూ సెంచరీ(114 పరుగులు)తో అదరగొట్టాడు. అతడికి శ్రేయాస్ అయ్యర్ (65 పరుగులు) నుండి మంచి సహకారం లభించింది. దీంతో భారత్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

india vs west indies final odi updates
Author
West Indies, First Published Aug 14, 2019, 7:02 PM IST

భారత్-వెస్టిండిస్ ల మధ్య జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి విండీస్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన 32 ఓవర్లలోనే  ఛేదించింది. రెండో వన్డేలో మాదిరిగానే కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లోనూ సెంచరీ(114 పరుగులు)తో అదరగొట్టాడు. అతడికి శ్రేయాస్ అయ్యర్ (65 పరుగులు) నుండి మంచి సహకారం లభించింది. దీంతో భారత్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 35  ఓవర్లకు కుదించారు. 

మడు వన్డేల సీరిస్ లో భాగంగా మొదటి వన్డే వర్షం కారణంగా పూర్తిగా రద్దయ్యింది. ఇక రెండో వన్డేలో కోహ్లీ, అయ్యర్ ల విజృంభణకు భువనేశ్వర్ బౌలింగ్ తోడవడంతో భారత్ విజయం సాధించింది. నిర్ణయాత్మక  మూడో వన్డేలో కూడా మళ్లీ వారిద్దరే చెలరేగి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. దీంతో టీ20 సీరిస్ మాదిరిగానే వన్డే సీరిస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేయగలిగింది.   

భారత జట్టు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాలను కొనితెచ్చకుంది. 92 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధవన్(36 పరుగులు) తో పాటు రిషబ్ పంత్ లు పెవిలియన్ కు చేరారు. అలెన్ వేసిన 12 వ ఓవర్ 2వ బంతికి ధవన్ ఔటవగా అదే ఓవర్లో 4వ బంతికి పంత్ డకౌటయ్యాడు. 

241 పరుగుల విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియయాకు ఆరంభంలోనే  ఎదురుదెబ్బ  తగిలింది.  ఓపెనర్ రోహిత్ శర్మ(10  పరుగులు) ఆదిలోనే  వికెట్  కోల్పోయాడు. 

వర్షం కారణంగా భారత్-వెస్టిండిస్ మధ్య జరుగుతున్న వన్డే మ ్యాచ్  కాస్తా 35 ఓవర్ల మ్యాచ్ గా మారిపోయింది. వర్షం చాలాసేపు మ్యాచ్ కు అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించారు. ఇలా  మొదట 35 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన విండీస్ 7 వికెట్ల  నష్టానికి 240 పరుగులు చేసింది. బ్యాట్స్ మెన్స్ లో గేల్ 72, లూయిస్ 43, పూరన్ 30  పరుగులతో ఆకట్టుకున్నారు.  భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, షమీ 2, జడేజా 1, చాహల్ 1 వికట్  పడగొట్టారు. 

విండీస్ 22 ఓవర్లలో 158 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో వుండగా రెండోసారి వర్షం అడ్డుకుంది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. 

చివరి వన్డేలో చెలరేగి ఆడుతూ క్రిస్ గేల్ భారత శిబిరాన్ని కాస్సేపు ఆందోళనలోకి నెట్టాడు. కేవలం  41 బంతుల్లోనే 72 పరుగులు చేసిన అతడు చివరకు ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇలా చివరిసారి బ్యాటింగ్ చేసిన అతడు ఔటయి మైదానాన్ని వీడుతుంటే ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులందరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. 

 విండీస్ ఓపెనింగ్ జోడీని విడదీయడంలో భారత బౌలర్లు సఫలీకృతమయ్యారు. కేవలం 11 ఓవర్లలోనే 115 పరుగులు చేసి ప్రమాదకరంగా మరింత ప్రమాదకరంగా మారుతున్న విండిస్ ఓపెనర్లను చాహల్ విడదీశాడు. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లూయిస్ ఔటయ్యాడు.  

భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న చివరి వన్డే కు వర్షం ఆటంకం కలిగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 1.3 ఓవర్లలో8/0వద్ద వుండగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. 

మూడు వన్డేల సీరిస్ లో భాగంగా జరుగుతున్న చివరి వన్డే కోసం భారత్, వెస్టిండిస్ జట్లు సిద్దమయ్యాయి. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా రెండో వన్డేను టీమిండియా గెలుచుకుంది. దీంతో సీరిస్ విజయంలో కీలకంగా మారిన మూడో వన్డేలో గెలుపే లక్ష్యంగా ఆతిథ్య, పర్యాటన జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సీరిస్ ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయిన విండీస్ కనీసం భారత్ తో సమానంగా నిలవాలని చూస్తోంది. కోహ్లీసేన మాత్రం టీ20 సీరిస్ మాదిరిగానే వన్డే సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసి ఈ ట్రోపీని కూడా హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. 

ఈ మ్యాచ్ కోసం కొద్దిసేపటి క్రితమే నిర్వహించిన టాస్ ను ఆతిథ్య విండీస్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ హోల్డర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.కాబట్టి భారత్ మొదట పీల్డింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్ కు దిగనుంది.   

రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేపట్టినట్లు టీమిండియా కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో యజువేందర్ చాహల్ తుది జట్టులోకి చేరినట్లు తెలిపాడు. మిగతా  జట్టు యదావిధిగా కొనసాగిస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. 

ఇక రెండో వన్డేలో ఓటమిపాలైన విండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.  కాట్రెల్, థామస్ ల స్థానంలో కీమో పాల్, అలెన్ లు తుది జట్టులో చేరినట్లు కెప్టెన్ హోల్డర్ వెల్లడించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios